Home /News /coronavirus-latest-news /

SCIENTIST NEW REPORT THERE IS CHANCE TO PANDEMIC ALERT AFTER 60 YEARS NGS

Pandemic Alert: కరోనా వైరస్‌ కంటే మరో తీవ్రమైన వైరస్‌ పొంచి ఉందా..? ఎప్పుడంటే..?

2080లో కరోనా కంటే ఘోరమైన మహమ్మారి..

2080లో కరోనా కంటే ఘోరమైన మహమ్మారి..

ప్రపంచానికి మరో మహా ముప్పు పొంచి ఉందా..? కరోనా వైరస్ కు మంచి ప్రభావం ఉంటుందా..? తాజా అధ్యయానాలు చూస్తే భయపడే పరిస్థితి కనిపిస్తోంది.. ఇంతకీ అధ్యయనంలో ఏం చెప్పారంటే..?

  కరోనా (corona) ఈ పేరు వింటేనే గజగజ వణికిపోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసేసింది. ఫస్ట్, వేవ్ సెకెండ్ వేవ్ అంటూ సునామీలా విరుచుకుపడింది. ఇక థర్డ్ వేవ్ (corona third wave) లో ఇంకెంత భయాన్ని చూడాల్సి వస్తుందో అని కలవరపెడుతోంది. అయితే ఇప్పుడు మరో వార్త ఆందోళన పెంచుతోంది. కరోనా భూతాన్ని మించిన మరో మహమ్మారి రాబోతోందా? మళ్లీ ఎన్నేళ్లకి ప్రపంచ దేశాలపై ఇలాంటి వైరస్‌ కొమ్ములు విసురుతుంది ? అన్న దానిపై తాజా అధ్యయనాలు భయపెడుతున్నాయి. అసలు పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టించే కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకి ఒకసారి వస్తాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ ఆ అంచనాలన్నీ తప్పయ్యే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. మరో 60 ఏళ్లలోనే ఇలాంటి మహమ్మారి ప్రజల్ని కాటేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో అత్యంత అరుదుగా సంభవించే ఇలాంటి వైరస్‌లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకు ఒక్కసారి కాదని, వచ్చే 60 ఏళ్లలో.. అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని హెచ్చరించారు. ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

  అధ్యయనం ఎలా చేశారంటూ..?
  తాజాగా అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్‌ మార్కో మరాని, ఆయన బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు. 400 ఏళ్లలో చికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాలను ఆ బృందం సేకరించింది, వాటి ఆధారంగా భవిష్యత్‌లో వచ్చే ముప్పుపై అధ్యయనం చేసింది. ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా, టైఫస్, స్పానిష్‌ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడు వచ్చాయి ? ఎన్నేళ్లు మానవజాతిని పీడించాయి ? ఎంత తరచుగా ఇలాంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలన్నీ సేకరించి దాని ఆధారంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పుపై అంచనా వేశారు.

  భవిష్యత్‌లో పుట్టుకొచ్చే వైరస్‌లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త డాక్టర్‌ మార్కో మరాని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో.. వందేళ్లలో ఇలాంటి వరదలు చూశామని ఎవరైనా వ్యాఖ్యానిస్తే మళ్లీ అంతటి ఉధృతిలో వరద రావడానికి మరో 100 సంవత్సరాలు వేచి చూడాలని అర్థం కాదని ఇక అధ్యయనం సహ రచయిత అయిన డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త గార్బియల్‌ కాటుల్‌ అభిప్రాయపడ్డారు. వందేళ్లు అన్నది కొలమానం కాదని.. ఈ లోపు ఎప్పుడైనా అంటే వచ్చే సంవత్సరమైనా అలాంటి వరద ముంచెత్తుతుందని అన్వయించుకోవాలన హెచ్చరించారు. మరోవైపు తరచూ ఎందుకు వైరస్‌లు పంజా విసురుతున్నాయో తెలుసుకోవడానికే ఈ గణాంకాలను సేకరించి అధ్యయనం చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: పేదింటి అమ్మాయికి పెళ్లి చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్స్.. ఎలా చేశారో తెలుసా..?

  ఆ అధ్యయనం ఏం చెబుతోంది అంటే..
  ప్రపంచ దేశాలపై కోవిడ్‌–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉంది.. అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్‌ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది అని తెలుస్తోంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్‌లు బయటపడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్‌ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్‌ ఉంది. 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్‌ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి వెలుగు చూసే అవకాశం ఉంటుంది. మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు అందుతున్నాయి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Corona virus outbreak, Covid -19 pandemic, Pandemic situation, Pandemic time

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు