Coronavirus: మార్చి 14 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. అక్కడ కరోనా ఉగ్రరూపం..

Coronavirus: మార్చి 14 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. అక్కడ కరోనా ఉగ్రరూపం..

ప్రతీకాత్మక చిత్రం

Coronavirus: ఫిబ్రవరి 24 నుంచి సగటున వెయ్యికి పైగా కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉన్న ఆంక్షలను మార్చి 14 వరకు పొడిగించారు

  • Share this:
    మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అలజడి రేపుతోంది. నిత్య భారీ మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్నాటకలోనే ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే పుణె అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. మార్చి 14 వరకు నగర పరిధిలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జనాలు రోడ్ల మీద తిరగకూడదు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇక మార్చి 14 వరకు స్కూళ్లు, కాలేజీలతో పాటు అన్ని విద్యా సంస్థలు తెరచుకోవని పుణె మేయర్ మురళీధర్ మోహల్ ప్రకటించారు.

    పుణెలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఫిబ్రవరి 24 నుంచి సగటున వెయ్యికి పైగా కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉన్న ఆంక్షలను మార్చి 14 వరకు పొడిగించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. పుణెలో ఇప్పటి వరకు 4,06,453 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,87,527 మంది కోలుకోగా.. 9,235 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ 9,860 యాక్టివ్ కేసులున్నాయి.

    మన దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటికీ అక్కడ కరోనా ఉద్ధ‌తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 8,623 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 51 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,46,777 కరోనా కేసులు నమోదవగా.. 52,092 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 73,734 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదర్భ ప్రాంతంలోని అకోలా, అమరావతి, యావత్మల్, బుల్దానా, వార్దా, నాగపూర్ జిల్లాలోనే ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు.

    ఇక మన దేశంలో కొత్తగా 16,752 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.11 కోట్లకు దగ్గర్లో ఉంది. నిన్న 113 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,57,051కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. నిన్న 11,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. దేశంలో రికవరీ రేటు 97.1 శాతం ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,64,511 ఉన్నాయి. నిన్న దేశంలో 7,95,723 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21.62 కోట్లు దాటింది
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు