SC SLAMS RBI ON INTEREST ON LOANS IN MORATORIUM SAYS ECONOMIC ASPECT NOT HIGHER THAN HEALTH OF THE PEOPLE SS
EMI Moratorium: ఆర్బీఐ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ఈ నేపథ్యంలో కేసును సీబీఐకు అప్పగించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు, అప్పులు ఇచ్చిన సంస్థలు రూ.2 లక్షల కోట్లు నష్టపోతారని ఆర్బీఐ సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది.
కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులపై ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం ఎంచుకున్నవారికి ఈ ఆరు నెలల కాలానికి ఔట్స్టాండింగ్పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యం కన్నా ఆర్థిక పరిస్థితి ముఖ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు, అప్పులు ఇచ్చిన సంస్థలు రూ.2 లక్షల కోట్లు నష్టపోతారని ఆర్బీఐ సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. "ఈ అంశాన్ని మీడియాకు లీక్ చేసి సంచలనాత్మకం చేయాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది" అని సుప్రీం కోర్టు అన్నట్టు CNBC-TV18 వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.