వలస కూలీల నెత్తిన పాలు పోసిన సుప్రీంకోర్టు...

వలస కార్మికుల తరలింపు సందర్భంగా వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

news18-telugu
Updated: May 28, 2020, 4:21 PM IST
వలస కూలీల నెత్తిన పాలు పోసిన సుప్రీంకోర్టు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వలస కార్మికుల తరలింపు సందర్భంగా వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల కొందరు వలస కూలీలు ఆకలితో చనిపోతున్నారు. అలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించింది. వలస కూలీలకు ఆహారం, నీరు అందించాలని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు వలస కూలీలను పంపేందుకు రాష్ట్రాలు రైళ్లను బుక్ చేశాయి. లేదా బస్సులను బుక్ చేశాయి. వాటికి సంబంధించి ఒక్క రూపాయి కూడా వలస కూలీల నుంచి వసూలు చేయకూడదు. ఆ ఖర్చు రాష్ట్రాలే భరించాలి.

నిలిచిపోయిన వలస కూలీలకు ఆయా రాష్ట్రాలు ఆహారం, నీరు అందించాలి. ఆహారం అందించే కేంద్రాలను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి.

రైళ్లలో ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లను ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. రైల్వే కూడా వారికి ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లు చేయాలి. బస్సుల్లో కూడా ఇదే విధానం అమలు కావాలి.

వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలి.

రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లే వలస కూలీలను వెంటనే ఆపేయాలి. వారిని షెల్టర్లకు తరలించాలి. వారికి ఆహారం, సదుపాయాలు అందించాలి.
First published: May 28, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading