'సంజీవని గాడీ' : భారత్ లోని మారుమూల గ్రామాలకు COVID-19 వ్యాక్సిన్..

'సంజీవని గాడీ' : భారత్ లోని మారుమూల గ్రామాలకు COVID-19 వ్యాక్సిన్..

Sanjeevini Gadi : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారి ని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక ఆయుధం కోవిడ్ వ్యాక్సిన్. ఇలాంటి వ్యాక్సిన్ పై సాధారణ ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయ్.

 • Share this:
  'సంజీవని గాడీ' భారతదేశంలో దారుణంగా COVID-19 బారిన పడిన ఐదు జిల్లాలలోని ప్రతీ గ్రామానికి చేరుకుంటుంది. Network18 మరియు Federal Bank వ్యాక్సిన్‌పై అవగాహనా ప్రచార కార్యక్రమం 'సంజీవని - అ షార్ట్ ఆఫ్ లైఫ్' తో ముందడుగు వేసాయి. అట్టడుగు స్థాయికి కూడా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, COVID-19 వలన తీవ్రంగా ప్రభావితమైన ఐదు జిల్లాలలోని ప్రతీ గ్రామానికి 'సంజీవని గాడీ' చేరుకుంటుంది. ఈ వాహనాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా క్యాంపైన్ అంబాసిడర్ సోనూ సూద్ ప్రారంభించారు.ఈ ప్రచార వాహనం ప్రస్తుతం ఇండోర్ (మధ్యప్రదేశ్), అమృత్‌సర్ (పంజాబ్), దక్షిణ కన్నడ (కర్ణాటక), నాసిక్ ( మహారాష్ట్ర), గుంటూరు (ఆంధ్రప్రదేశ్) జిల్లాలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇది అమృత్సర్‌లోని 70 గ్రామాలను, ఇండోర్, దక్షిణ కన్నడ జిల్లాలలో దాదాపు 100 గ్రామాల వరకు తిరుగుతుంది.

  ఈ వాహనం ఐదు జిల్లాలలోని 500 లకు పైగా గ్రామాలకు ప్రయాణించి, ప్రజల్లో COVID-19 వ్యాక్సిన్‌పై గల అపోహలను తొలగించి, దానిపై వారికి అవగాహన కలిగిస్తారు. అంతేకాకుండా COVID-19 భద్రతా నియమాలను అనుసరించడం గురించి కూడా గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. అదనంగా ఈ వాహనం సందర్శించిన తరువాతి రోజున ఆరోగ్య భాగస్వామి Apollo 247 మరియు NGO భాగస్వామి United Way Mumbai తో కలిసి వ్యాక్సిన్ శిబిరాలకు కూడా ఏర్పాటు చేస్తుంది.

  ఈ మహమ్మారి వలన అతిదారుణంగా ప్రభావితమైన దేశాలలో ఒకటిగా నిలిచిన భారతదేశం సెకండ్ వేవ్ సంక్రమణ వలన మరింతగా స్తంభించిపోయింది. రోజురోజుకీ దిగజారిపోతున్న పరిస్థితుల మధ్య, ఈ కరోనా వైరస్‌ను ఓడించడానికి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయడమే తక్షణ కర్తవ్యంగా కనిపిస్తుంది.
  Published by:Sridhar Reddy
  First published: