SANJEEVANI SHOT AT LIFE WHO VACCINATED THEY ARE ALL SAFE MORE THAN 80 PERCENT GUNTUR FAMILY IS PERFECT EXAMPLE NGS
Sanjeevani: సంజీవనిగా నిలుస్తున్న వ్యాక్సిన్.. గుంటూరులో ఓ కుటుంబానికి వ్యాక్సిన్ అందక ఒకరి బలి..
వ్యాక్సిన్ సంజీవని
Network18 Sanjeevani: కోవిడ్ వ్యాక్సిన్ మనుషుల ప్రాణాలకు సంజీవనిగా మారుతోంది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారు ప్రాణాలకు రక్షణ లభిస్తోంది. అందుకే వ్యాక్సిన్ పై న్యూస్ 18 నెట్ వర్క్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఎంతో మందికి అవగాహన కల్పిస్తోంది.
Network18 Sanjeevani: కరోనా (Corona) కష్ట కాలంలో మనుషుల ప్రాణాలకు సంజీవనిగా మారింది వ్యాక్సిన్(Vaccine).. చాలామంది ప్రాణాలను కాపాడుతోంది. కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) సమయంలో కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. అయితే ఆ కుటుంబంలో వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు క్షేమంగా కోలుకున్నారు. లేని వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇదే టీకా మహత్యం.. అందుకే వ్యాక్సినేషన్ పై అవగాహన ప్రచార కార్యక్రమం కొనసాగిస్తోంది Network18 Sanjeevani కార్యక్రమం. టీకాలు తీసుకుంటే ప్రాణాలు నిలుస్తాయి అనడానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. ఇప్పటికే న్యూస్ 18 నెట్ వర్క్ సిబ్బంది సంజీవని కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఊరూరూ తిరుగుతూ వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా (Guntur District)లో చోటు చేసుకున్న విషాదం గురించి తెలిసింది. ఆ కుటుంబం గురించి తెలుసుకుంటే టీకాలు వేయడం ఎందుకు అంత ముఖ్యమైనవి అన్నది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నివసిస్తున్న ఒక కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఆ కుటుంబంలో వ్యాక్సిన్ వేసుకున్న అత్తగారు, సీనియర్ సిటిజన్ కరోనాను ఓడించారు. కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోలేకపోయిన కోడలు.. వైరస్ కారణంగా మరణించింది. ఆమె వయసు కేవలం 37 సవంత్సరాలు మాత్రమే.. అంత చిన్నవయసులోనే మరణించడంతో ఆ ఇంటిలో పెను విషాదం నెలకొంది. న్యూస్ నెట్వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ అవగాహన ప్రచారం సంజీవని - టీకాపై లైఫ్ షాట్ బృందం గుంటూరులో నివసిస్తున్నఆ కుటుంబాన్ని కలిసి వారి కష్టాలను తెలుసుకుంది. ఇకపై ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వ్యాక్సిన్ పై అవగాహనను మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది.
ఐదు జిల్లాల్లో సంజీవని వాహనం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాల్లో సంజీవని వాహనం సంచరిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో సంజీవని కారు చేరుకుంది. ఆ జిల్లాల్లో ఇప్పటికే సంజీవని కారు 120 గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకుంది. ఇప్పటి వరకు అక్కడ 14,765 మందికి అవగాహన కల్పించింది. అలాగే వ్యాక్సినేషన్ కేంద్రాలకు ప్రజలను తీసుకెళ్లి మరి అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత జిల్లాల్లో ఈ అవగాహన ప్రచారం చేపడుతోంది.
అత్తగారి ప్రాణం కాపాడిన వ్యాక్సిన్
గుంటూరులోని చిలుకులూరిపేట గ్రామంలో ఓ కుటుంబంలోని కరిష్మా షేక్ 20 ఏళ్ల కళాశాల విద్యార్థి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు తిరగక మానవు. కొన్ని నెలల క్రితం ఆ ఇంటిని కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది. కొన్ని నెలల కిందట ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులకు కరోనా సోకింది. తనకు.. తల్లికి.. అలాగే అమ్మమ్మకి కరోనా సోకినట్టు ఆమె చెప్పింది. అయితే తాను, అమ్మమ్మ కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఉన్నామని.. కానీ తన తల్లికి శ్వాస అందక ఇబ్బంది పడడంతో.. వెంటనే ఆసుపత్రిలో చేర్చామని చెప్పింది. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల్లో 60% దెబ్బతిన్నాయని, కోవిడ్ 15 పాయింట్లకు చేరింది.. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమెను క్వారంటైన్ లో ఉంచి చికిత్స ప్రారంభించారు. కానీ పది రోజుల తరువాత ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆ సమయానికి ఆక్సిజన్ లేకపోవడంతో వెంటనే మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉండడంతో తన తల్లి మరణించిందని కరిష్మ కన్నీరు పెట్టుకుంది.
37 ఏళ్ల తన తల్లి కరోనా సోకి మరణించినా.. తాను.. తన అమ్మమ్మ కరోనాను ఓడించామని ధైర్యంగా చెబుతోంది. కరోనాను ఓడించిన తన అమ్మమ్మ షేక్ అమిరుల్ అప్పటికే వ్యాక్సిన్ వేసుకుందని గుర్తు చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగానే తన అమ్మమ్మ జీవించిందని.. అలాగే తన తల్లి మస్తానీకి కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రయత్నించాం కాని.. అప్పటికి 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేసేవారని.. దీంతో తన తల్లి మస్తానీకి వ్యాక్సిన్ వేయించలేకపోయామని.. అలా కాకుండా వ్యాక్సిన్ వేయించి ఉంటే తన తల్లి బతికేదని కరిష్మ కన్నీరు పెడుతోంది.
వ్యాక్సిన్ సంజీవని అని చెప్పడానికి ఇంతకన్నా ఉదహరణ ఏం కావాలి.. భారత దేశ వ్యాప్తంగా మొదట 45 ఏళ్లు దాటిన వాళ్లకు వ్యాక్సిన్ వేయడంతో రెండో దశలో వారి మరణాల రేటు తగ్గి.. 45 ఏళ్ల లోపు వారి మరణాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోలేకపోయిన వారే ఎక్కువగా కరోనా బారిన పడి మరణించినట్టు స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. అందుకే వ్యాక్సిన్ ను సంజీవని అనడం లో ఎలాంటి సందేహం లేదు. న్యూస్ 18 నెట్ వర్క్.. అందుకే దీనిపై ముమ్మరంగా ప్రచారం కల్పిస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.