భారతదేశపు అతిపెద్ద వ్యాక్సినేషన్ అవగాహన డ్రైవ్ అయిన ‘Sanjeevani: A Shot Of Life’ (‘సంజీవని: ఎ షాట్ ఆఫ్ లైఫ్’) ప్రచార గీతం ప్రత్యేకమైన డిజిటల్ ఇనిషియేటివ్ ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున విడుదలైంది. ఆనంద్ నరసింహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ సమక్షంలో క్యాంపెయిన్ అంబాసిడర్ సోనూ సూద్, కంపోజర్ శంకర్ మహదేవన్ ఈ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. కొత్త విధానాలను పాటిస్తూ, ఆకట్టుకునేలా ఈ వేడుకను పెద్ద ఎత్తున్న వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ అతిపెద్ద డిజిటల్ వేడుకలో కంపోజర్‌లు, లిరిసిస్ట్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Network18 Sanjeevani – A Shot of Life అనేది Federal Bank వారి CSR ఇనిషియేటివ్. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఇది ప్రారంభమైంది. కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించి, ప్రతి భారతీయుడు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రయత్నాలు చేయడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ఇప్పటివరకు, నాసిక్, గుంటూరు, దక్షిణ కన్నడ, అమృత్‌సర్, ఇండోర్‌లలో దాదాపు 1,00,000 మందికి సంజీవని గాఢీ చేరువైంది.
ఇక ఇప్పుడు ఆకట్టుకునే “మీ వంతు వచ్చినప్పుడు టీకా వేసుకో” అంటూ సాగే ఆకట్టుకునే ట్యూన్‌తో, ప్రతి భారతీయుడిని వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రచార గీతం ప్రేరేపిస్తోంది. శంకర్ మహదేవన్ స్వరాలు సమకూర్చి శివమ్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, హర్షదీప్ కౌర్‌లు పాడిన ఈ ప్రచార గీతాన్ని తనిస్క్ నబార్ రచించారు.
వ్యాక్సిన్ ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వేడుకలో పాల్గొన్న ప్రముఖులు వ్యాక్సినేషన్ అవసరాన్ని మరోసారి తెలియజేశారు. రెండో వేవ్ కరోనాను తట్టుకుంటూ, మూడో వేవ్ కోసం సంసిద్ధం కావడానికి, దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది.
‘ప్రచార గీతం’
వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ప్రోత్సహించడం ద్వారా, కొవిడ్-19 నుండి సాధారణ జీవితం వైపుగా తరలడంలో ‘Sanjeevani’ (సంజీవని) ఆశలు చిగురింపజేస్తోంది. అందరికీ అర్థం అయ్యే పదాలతో ఉన్న ప్రచార గీతం తప్పనిసరిగా వివిధ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది. ఆకట్టుకునే ట్యూన్‌తో ఉన్న ఈ ప్రచార గీతం వెంటనే ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకుని వెళ్లి, సందేశాన్ని అందిస్తుంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి సానుకూల దృక్పథాన్ని అలవడేలా చేస్తుంది.
'అంతర్జాతీయ యోగా దినోత్సవం & ప్రచార గీతం ఆవిష్కరణ’
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే ప్రచార గీతం విడుదల కూడా జరిగింది. అటు యోగా, ఇటు వ్యాక్సిన్ రెండూ మనల్ని రక్షించేవే. యోగా ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడినట్లే, ప్రస్తుత రోజుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ చాలా అవసరం.
అంతర్జాతీయంగా యోగా పేరు సంపాదించుకున్నట్లుగానే, భారతదేశ దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి ‘Sanjeevani’ (సంజీవని) లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే వరకు ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరని గుర్తు చేస్తూ, ఇటీవల విడుదలైన ప్రచార గీతం దేశంలోని ప్రతి మూలలో ఉన్న వారికి అవగాహన ఏర్పరిచే ప్రయత్నం చేస్తోంది. కొవిడ్-19 ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని తెలియజేసే ప్రచారానికి ఈ ప్రచార గీతం గొంతుకను కలిపింది. అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రచారం చేయడడం ద్వారా, ఈ ప్రచారం ప్రజల జీవితాలకు ఓ ‘సంజీవని’గా మారింది. #TikaLagayaKya #టీకావేసుకున్నారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Coronavirus, Covid-19, Network18, Sanjeevani