Mulayam Singh Yadav: మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా పాజిటివ్

Mulayam Singh Yadav: మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా పాజిటివ్

ములాయం సింగ్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. బుధవారం జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Share this:
    ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. బుధవారం జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ములాయం సింగ్ యాదవ్‌కు ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమి లేవని.. అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్‌లో బుధవారం ఒక ప్రకటన చేసింది.

    ములాయం సింగ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ట్వీట్ చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ఆయనను గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. తాము ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ తెలియజేస్తామని పేర్కొన్నారు.



    ఇక, ఈ ఏడాదిలో పలు అనారోగ్య సమస్యలతో ములాయం సింగ్ యాదవ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఒంట్లో నీరసంగా ఉండటంతో ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చేరారు. అక్కడ ములాయం సింగ్ యాదవ్‌కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన తేలికపాటి అనియంత్రిత డయాబెటిస్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఇక, ఆగస్టు మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఓ ప్రైవేటు ఆప్పత్రిలో చేరారు.


    ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1996 నుంచి 1998 మధ్యకాలంలో ఆయన యూనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆయన అజమ్‌ఘర్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగారు.
    Published by:Sumanth Kanukula
    First published: