బార్బర్ షాప్స్‌లో కొత్త రూల్.. ఎవరి టవల్ వాళ్లే తెచ్చుకోవాలి..

బార్బర్ షాప్స్‌లో కొత్త రూల్.. ఎవరి టవల్ వాళ్లే తెచ్చుకోవాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి బార్బర్ షాప్ నిర్వాహకుడు కత్తెరలు, దువ్వెనలు, హెయిర్ బ్రష్‌లును శానిటైజ్ చేయాలి. షాప్‌లో కస్టమర్లు మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి.

 • Share this:
  ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ 4 అమల్లో ఉన్నా.. ప్రభుత్వాలు ఎన్నో సడలింపులు ఇచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తప్ప అన్ని దుకాణాలు తెరచుకున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవలే హెయిర్ సెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే అన్ని షాపుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. ఐతే మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా యంత్రాంగం మరిన్ని కఠిన నిబంధనలు విధించారు. బార్బర్ షాప్‌కు వెళ్లే కస్టమర్లు ఎవరి టవల్ వారే తీసుకెళ్లాలి. అంతేకాదు ప్రతి బార్బర్ షాప్ నిర్వాహకుడు కత్తెరలు, దువ్వెనలు, హెయిర్ బ్రష్‌లును శానిటైజ్ చేయాలి. షాప్‌లో కస్టమర్లు మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి.

  కాగా, బుధవారం రాత్రి మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2190 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 964 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 105 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 17,918 మంది కోలుకోగా..1,897 మంది మరణించారు. మహారాష్ట్రలో 37,125 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు