పొలం దున్నిన సల్మాన్ ఖాన్... ఓవరాక్షన్ వద్దంటూ నెటిజన్ల ట్రోలింగ్...

పొలం దున్నిన సల్మాన్ ఖాన్... ఓవరాక్షన్ వద్దంటూ నెటిజన్ల ట్రోలింగ్...

పొలం దున్నిన సల్మాన్ ఖాన్... ఓవరాక్షన్ వద్దంటూ నెటిజన్ల ట్రోలింగ్... (credit - twitter)

MS ధోనీ లాగా... సల్మాన్ ఖాన్ కూడా వ్యవసాయం ప్రారంభించాడు. కానీ... ధోనీని మెచ్చుకున్న నెటిజన్లు... సల్మాన్‌ను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నా్రు?

 • Share this:
  కరోనా లాక్‌డౌన్ రాగానే... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... జార్ఖండ్‌లోని తన 60 ఎకరాల పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించాడు. ఇటు ముంబైలో... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వ్యవసాయం ప్రారంభించాడు. ఐతే... ధోనీ చేస్తున్న వ్యవసాయ విధానాలు నెటిజన్లకు బాగా నచ్చాయి. ధోనీ బొప్పాయి, అరటి తోటల పెంపకానికి... ప్రత్యేకంగా నిపుణుల సలహాలు తీసుకుంటూ... సీరియస్‌గా వ్యవసాయం చేస్తుంటే... నెటిజన్లు... మిస్టర్ కూల్... నిజంగానే కూల్ అని పొగిడారు. అదే సమయంలో... సల్మాన్‌ఖాన్‌ని మాత్రం... ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని విమర్శిస్తున్నారు. తాను వ్యవసాయం చేస్తున్నట్లు ధోనీ స్వయంగా చెప్పుకోలేదు. మీడియానే ఆ విషయాన్ని హైలెట్ చేసింది. సల్మాన్ ఖాన్ మాత్రం... తనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు.


  ఈమధ్య బురద పొలంలోకి వెళ్లిన సల్మాన్... అందుకు సంబంధించి ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఏకంగా వీడియోనే పెట్టాడు. తన పాన్వెల్ ఫామ్‌హౌస్‌లోని బురదతో కూడిన పొలంలో ట్రాక్టర్ నడిపాడు. ఇందులో సల్మాన్‌కి ఓ వ్యక్తి సహాయకుడిగా ఉన్నాడు. ఓ సందర్భంలో... సల్మాన్ బురదలో నడుస్తూ కనిపించాడు. సల్లూభాయ్ మద్దతు దారులు... ఈ వీడియోని చూసి మెచ్చుకున్నారు. నీలాంటి వాళ్లు ఇలా చేయడం వల్ల చాలా మందికి ఇన్స్‌పిరేషన్ కలుగుతుంది అని ప్రశంసించారు. అదే సమయంలో చాలా మంది నెటిజన్లు మాత్రం... ఓవరాక్షన్ ఆపమని విమర్శలు చేశారు. ప్రజల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనే సల్మాన్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడని ఓ యూజర్ ట్రోల్ చేశారు.
  ఓ యూజర్ అటు ధోనీ, ఇటు సల్మాన్ ఇద్దర్నీ విమర్శించారు. ఈ విధంగా వాళ్లు ప్రజలకు ప్రేరణ కల్పిస్తున్నారని సెటైర్ వేశారు.
  సల్మాన్ PR టీమ్ బాగా పనిచేస్తోందనీ... పొలంలో వ్యవసాయాన్ని కూడా... సినిమా రేంజ్‌లో షూట్ చేసి... వీడియో చేశారని మరో యూజర్ తిట్టిపోశారు.


  మొత్తానికి సల్మాన్ ఏ ఉద్దేశంతో ఆ వీడియో పెట్టాడో గానీ... రియాక్షన్స్ మాత్రం ఈ రేంజ్‌లో సాగుతున్నాయి. ఏది ఏమైనా వ్యవసాయం అనేది ఈజీ ఏమీ కాదు. దేశంలో రోజూ కోట్ల మంది రైతులు ఎంతో కష్టపడుతున్నారు. ఎలాంటి సదుపాయాలూ లేకపోయినా... అప్పులు చేసి మరీ ప్రజల ఆకలి తీర్చుతున్నారు. ఆ కష్టం తెలుసు కాబట్టే నెటిజన్లు ఇలాంటి సరదాగా చేస్తున్న వీడియోలను వ్యతిరేకిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు