రేపు సచిన్ బర్త్ డే.... స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న మాస్టర్...

రేపు సచిన్ బర్త్ డే....  స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న మాస్టర్...

సచిన్ టెండుల్కర్ (File)

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో తన బర్త్ డే జరుపుకోకూడదని సచిన్ టెండూల్కర్ నిర్ణయించుకున్నాడు.

  • Share this:
    భారత జట్టు మాజీ క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఈనెల 24న సచిన్ పుట్టిన రోజు. తన 47వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో తన బర్త్ డే జరుపుకోకూడదని ఈ భారతరత్నం నిర్ణయించుకున్నాడు. ‘ఈ సారి పుట్టినరోజు జరుపుకోకూడదని సచిన్ భావిస్తున్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, రక్షణ సిబ్బంది, ఫ్రంట్ లైన్‌లో ఉండి కరోనాతో పోరాడుతున్న వారికి ఈ రకంగా నివాళి అర్పించాలని భావిస్తున్నారు.’ అని సచిన్‌కు అత్యంత దగ్గరగా ఉండే విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సచిన్ టెండూల్కర్ ఇటీవల పీఎం కేర్, మహారాష్ట్ర సీఎంఆర్ఎఫ్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. దీంతోపాటు పలు సహాయకచర్యలు కూడా చేపట్టారు. ‘ఇలాంటి అంశాల గురించి మాట్లాడడం సచిన్‌కు పెద్దగా నచ్చదు.’ అని ఆ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఉన్న కోట్లాది మంది పలు రకాల సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సచిన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని అరుదైన 40 ఫొటోలను ఓ ఫ్యాన్ క్లబ్ రిలీజ్ చేయనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు