కరోనా మహమ్మారిని జయించిన సచిన్ తెందూల్కర్ డూప్

బల్బీర్ చంద్

పంజాబ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,074కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,700 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 99 మంది మరణించారు

  • Share this:
    బల్బీర్ చంద్..! ఇతడు చూడడానికి అచ్చం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ లాగే ఉంటాడు. పోలికలు, ముఖ కవళికలు చూస్తే నిజంగానే సచిన్ అనుకుంటారు. ఐతే కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడవన బల్బీర్ చంద్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. బల్బీర్ చంద్ ముంబైలో నివసిస్తున్నప్పటికీ.. ఆయన స్వస్థలం మాత్రం పంజాబ్‌లోని నవాశహర్. ఐతే కొన్ని రోజులు క్రితం ముంబై నుంచి పంజాబ్‌కు వెళ్లడంతో.. అక్కడ ఆయన్ను క్వారంటైన్ చేశారు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి చికిత్స పొందిన బల్బీర్ ఆదివారం డిశ్చార్జి అయ్యారు. కరోనాకు భయపడాల్సిన పనిలేదని..అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.

    కాగా, పంజాబ్ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం..గడిచిన 24 గంటల్లో అక్కడ 122 కొత్త కేసులు నమోదయ్యాయి. 22 మంది డిశ్చార్జి కాగా.. ఒకరు మరణించారు. తాజా లెక్కలతో కలిపి పంజాబ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,074కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,700 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 99 మంది మరణించారు. ప్రస్తుతం పంజాబ్‌లో 1275 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
    First published: