శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి..

కరోనా కారణంగా ఇప్పుడు అన్ని అంశాల్లో ఆంక్షలు సాధారణమైపోయాయి. దేవాలయాల్లోనూ ఆంక్షలు విధిస్తూ భక్తులను దర్శనాలు, ఇతర కైంకర్యాలకు అనుమతి ఇస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో కేరళలో 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 22 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో కేరళలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,699కి చేరింది.

  • Share this:
    లాక్ డౌన్ 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇస్తున్నారు. జూన్ 8 నుంచి నుంచి అన్‌లాక్ 1 మొదలవుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు హోటళ్లు, రెస్టారెంట్లు, దేవాలయాలకు సోమవారం నుంచి తెరుస్తున్నాయి. ఇక కేరళలోనూ జూన్ 9 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, రెస్టారెండ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఇక శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. వర్చువల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని తెలిపారు సీఎం పినరయి విజయన్.

    కాగా, గడిచిన 24 గంటల్లో కేరళలో 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 22 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో కేరళలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,699కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 712 మంది కోలుకోగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం కేరళలో 973 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొదట్లో కరోనాను కేరళ ప్రభుత్వం బాగా కట్టడి చేసింది. ఒకదశలో యాక్టివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు చేరాయి. మరో రెండు మూడు రోజుల్లో కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారబోతున్న తరుణంలో.. కేంద్రం వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం, శ్రామిక్ రైళ్లను నడపడంతో మళ్లీ కేసులు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి కేరళకు చేరుకున్న చాలా మందిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
    Published by:Shiva Kumar Addula
    First published: