S P BalaSubrahnamyam Health News: కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. దీనిపై వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన తెలిపారు. తన తండ్రికి కరోనా నెగిటివ్ లేదా పాజిటివ్ అన్నది ప్రస్తుతం ముఖ్యంకాదని.. ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారని ఎస్పీ చరణ్ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి తనకే సమాచారం ఉంటుందని.. ఈ అంశంలో డాక్టర్లతో చర్చించిన తరువాత తాను వీడియో ద్వారా సమాచారం విడుదల చేస్తున్నానని చెప్పారు.
ఈ నెల 5న బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆయన కొద్దిరోజులు ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ తరువాత లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజులుగా ఐసీయూలోనే వెంటిలేటర్‌పై ఉంటూ చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమించడంతో...ఆయనకు ఎక్మో ద్వారా అత్యాధునిక పద్ధతిలో వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, SP Balasubrahmanyam