కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ మేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజా హెల్త్ బులెటివ్ విడుదల చేసింది. ఈ నెల 5న బాలసుబ్రమణ్యంకు కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ఆయన కొద్దిరోజులు ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ తరువాత లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజులుగా ఐసీయూలోనే వెంటిలేటర్‌పై ఉంటూ చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు ఆకాంక్షించారు. తన తండ్రి అందరి ఆకాంక్షలతో త్వరగా కోలుకుంటారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం భార్య ఎస్పీ సావిత్రి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, S. P. Balasubrahmanyam, SP Balasubrahmanyam