షాకింగ్.. రష్యా ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్

రష్యాలో ఇప్పటి వరకు 106,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,619 మంది కోలుకోగా.. 1,073 మంది మరణించారు.

news18-telugu
Updated: April 30, 2020, 10:53 PM IST
షాకింగ్.. రష్యా ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్
రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్టిన్
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. కోవిడ్ దెబ్బకు సామాన్య ప్రజలే కాదు... పారిశ్రామిక వేత్తలు, దేశాధినేతలు సైతం వణికిపోతున్నారు. తాజాగా రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్టిన్‌ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చిది. గురువారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మిఖైల్ మిషుస్టిన్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


కాగా, రష్యాలో ఇప్పటి వరకు 106,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,619 మంది కోలుకోగా.. 1,073 మంది మరణించారు. ప్రస్తుతం రష్యాలో 93,806 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
First published: April 30, 2020, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading