కొత్త టెక్నాలజీ.. మాట్లాడినా, దగ్గినా కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది..

కొత్త టెక్నాలజీ.. మాట్లాడినా, దగ్గినా కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది..

ప్రతీకాత్మక చిత్రం

రష్యాకు చెందిన ఓ స్బెర్‌బ్యాంక్ సంస్థ ఓ కృత్రిమ మేథస్సును అభివృద్ది చేసింది. ఓ వ్యక్తి దాని ముందు ఓ 60 సెకన్ల పాటు మాట్లాడితే చాలు. వారికి కరోనా ఉందో లేదో కనిపెడుతుంది. అలాగే, దానిముందు దగ్గినా కూడా వారికి కరోనా వైరస్ ఉందో లేదో గుర్తించి చెబుతుందని ఆ కంపెనీ ప్రకటించింది.

  • Share this:
    కరోనా వైరస్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి జనం పలు రకాల టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే, కరోనా వైరస్ నిర్ధారణ చేయడానికి కొత్త కొత్త రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. రష్యాకు చెందిన ఓ స్బెర్‌బ్యాంక్ సంస్థ ఓ కృత్రిమ మేథస్సును అభివృద్ది చేసింది. ఓ వ్యక్తి దాని ముందు ఓ 60 సెకన్ల పాటు మాట్లాడితే చాలు. వారికి కరోనా ఉందో లేదో కనిపెడుతుంది. అలాగే, దానిముందు దగ్గినా కూడా వారికి కరోనా వైరస్ ఉందో లేదో గుర్తించి చెబుతుందని ఆ కంపెనీ ప్రకటించింది. కరోనా లక్షణాలు, మూడు రకాలైన వాయిస్ మాడ్యులేషన్స్‌ను బట్టి ఇది గుర్తిస్తుంది. రష్యాలోని పలు ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల వాయిస్‌ను పరిశీలించి, దాన్ని బట్టి కృత్రిమ మేథస్సు తయారు చేసింది. గత ఏడాది నవంబర్‌లోనే తాము ఇలాంటి అల్గారిథమ్ డెవలప్ చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీన్ని వినియోగించడానికి సులువుగా ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. అయితే, ఇది మెడికల్ టూల్ కాదని, ఓ వ్యక్తి తన వద్ద ఉంచుకుని రోజూ చెక్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పింది. రోజూ ఓసారి దాని ముందు మైక్‌లో మాట్లాడినట్టు 60 సెకన్ల పాటు మాట్లాడితే చాలు. వారికి కరోనా ఉందో లేదో చెబుతుంది.

    దేశం మొత్తం కరోనాను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే రష్యా కోవిడ్ 19కు వ్యాక్సిన్ తయారు చేసింది. తాము కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్’ తయారు చేసినట్టు రష్యా నవంబర్‌లోనే ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. కరోనాపై పోరులో స్పుత్నిక్ టీకా 92శాతం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని, ప్రజలను కోవిడ్ బారిన పడకుండా కాపాడుతున్నట్లు ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ఆధారంగా మధ్యంతర ఫలితాలను ప్రకటించిన మాస్కో ఈ డ్రగ్ విషయంలో ఇతర దేశాల చూపును తనవైపు తిప్పుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: