రష్యా సంచలనం...గాలిలో కరోనా వైరస్ ను గుర్తించే యంత్రం తయారు...

రష్యా సంచలనం...గాలిలో కరోనా వైరస్ ను గుర్తించే యంత్రం తయారు...

రష్యా అధ్యక్షుడు పుతిన్(ఫైల్ ఫోటో)

గాలిలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించే పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపింది. ఈ పరికరం కరోనాను మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా, విష పదార్థాలు అనేక ప్రమాదకరమైన వైరస్ల ఉనికిని తెలపగలదు.

  • Share this:
    కొద్ది రోజుల క్రితం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా...ఇప్పుడు గాలిలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించే పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపింది. ఈ పరికరం కరోనాను మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా, విష పదార్థాలు అనేక ప్రమాదకరమైన వైరస్ల ఉనికిని తెలపగలదు. ఈ పరికరాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ, గమేలియా ఇనిస్టిట్యూట్ సహకారంతో రష్యాకు చెందిన కెఎమ్‌జె ఫ్యాక్టరీ తయారు చేసింది. గతంలో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయడం విశేషం. ఈ పరికరానికి డిటెక్టర్ బయో అని పేరు పెట్టారు. శుక్రవారం మాస్కో సమీపంలో జరిగిన ఆర్మీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ 'ఆర్మీ 2020' సందర్భంగా డిటెక్టర్ బయో మెషిన్ ప్రదర్శించారు. KMJ ఫ్యాక్టరీ ఆఫ్ రష్యా ప్రపంచ ప్రఖ్యాత జెనిత్ కెమెరాను కూడా తయారు చేస్తుంది. డిటెక్టర్ బయో రిఫ్రిజిరేటర్ లాగా కనిపిస్తుంది. పరిసరాల్లోని గాలిని గ్రహించి పరీక్షిస్తుంది. ఈ పరికరం గాలిలో కరోనా వైరస్ ఉనికిని ఇది సులభంగా గుర్తిస్తుంది. ఫలితాన్ని ధృవీకరించడానికి ఇది చుట్టుపక్కల గాలిని రెండుసార్లు పరీక్షిస్తుంది.

    మొదటి దశలో, ఇది వైరస్, బ్యాక్టీరియా లేదా గాలిలో ఉన్న ఏదైనా విష పదార్థం గురించి 10 నుండి 15 సెకన్లలో మాత్రమే హెచ్చరికను పంపుతుంది. విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ యంత్రాన్ని ఇన్ స్టాల్ చేసి అక్కడి పరిసరాల్లో గాలిని పరీక్షించేలా రూపొందించారని దాని డెవలపర్లు అంటున్నారు.
    Published by:Krishna Adithya
    First published: