RUSSIA SUFFERING FOR COVID SPRED AND RECORD VIRUS DEATH EVK
Russia : వణుకుతున్న రష్యా.. పెరుగుతున్న కోవిడ్ కేసులు కారణం ఇదేనా!
ప్రతీకాత్మక చిత్రం
Russia : కరోనా దెబ్బకు రష్యా విలవిల లాడిపోతుంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కేసులువస్తున్నాయి. అంతే కాకుండా నిత్యం వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి.
కరోనా (Corona) దెబ్బకు రష్యా విలవిల లాడిపోతుంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కేసులువస్తున్నాయి. అంతే కాకుండా నిత్యం వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. రష్యాను కరోనా మహమ్మారి మళ్లీ గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నా యి. వరుసగా నాలుగో రోజూ కొవిడ్ మృ తుల సం ఖ్య 1200లకు పైగా నమోదైంది. దేశం లో బుధవారం 1247 మం ది కొవిడ్‌తో మృ త్యు వాత పడగా.. గురువారం 1251, శుక్రవారం 1254 మం ది చొప్పున
మరణిం చారు. అలాగే, శనివారం కూడా 1254మం ది కరోనా కాటుకు బలికాగా.. 37,120మం దికి ఈ మహమ్మా రి సోకినట్టు రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడిం చారు. గత కొన్ని వారాలుగా కొవిడ్
ఉద్ధృ తి తగ్గినట్టు కనబడినప్ప టికీ.. గతం లో కన్నా అధికం గా కేసులు, మరణాలు నమోదుకావడం గమనార్హం .
ఇప్పటికి 2.62లక్షమంది మృత్యువాత..
కరోనాతో రష్యా ఇబ్బంది పడుతుంది అనడానికి అక్కడ మరణాల రేటే సూచిక. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మం ది మాత్రమే పూర్తిగా టీకా వేయిం చుకున్నా రు.
ప్రపం చవ్యా ప్తం గా మొదట టీకా (First dose) ను ఆవిష్క రిం చిన ఆ దేశంలో వ్యా క్సి నేషన్ రేటు తక్కు వగా ఉం డటం ఆశ్చ ర్య పరుస్తోం ది. ఇప్ప టివరకు అక్క డ 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.62లక్షల మందికి పైగా చనిపోయారు. ఇది చాలు కరోనాతో రష్యా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి.
టీకాలు తీసుకోకపోవడమే కారణమా..
ఇప్పటికే ఒకవైపు కరోనా కట్టడికి రష్యా ప్రభుత్వం సెలవులు (holydays) ప్రకటిస్తే.. అక్క డి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నా రు. ఈ క్రమంలో అధిక సంఖ్య లో విమాన టికెట్ల (Flight Tickets) అమ్ముడయ్యా యని, హోటళ్లలో గదులు నిండిపోతున్నా యని, పర్యాటక ప్యాకేజీ (Tourism Packages) లకు డిమాండ్ పెరిగిందని అధికారులు గుర్తించడం విశేషం.. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైం ది. ఎక్కువ మందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్ ఉద్ధృ తికి కారణమని నిపుణులు అంటున్నా రు. ఏదైమైన రష్యా ప్రభుత్వం ప్రజల్లో అవగాహనతోపాటు టీకా పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.