Sputnik V: భారత్‌లో మరో వ్యాక్సిన్‌కు అనుమతి.. సిఫారసు చేసిన నిపుణుల కమిటీ..

Sputnik V: భారత్‌లో మరో వ్యాక్సిన్‌కు అనుమతి.. సిఫారసు చేసిన నిపుణుల కమిటీ..

Sputnik V Vaccine(Reuters)

రష్యా అభివృద్ది చేసిన ‘స్పుత్నిక్‌-వి’ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణల కమిటీ డీజీసీఐకి సిఫారసు చేసింది.

  • Share this:
    భారత్‌లో మరో కోవిడ్ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. భారత్‌లో రష్యా అభివృద్ది చేసిన ‘స్పుత్నిక్‌-వి’ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణల కమిటీ డీజీసీఐకి సిఫారసు చేసింది. ఇప్పటికే భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌‌లను అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లను ఇప్పుడు ప్రజలకు అందజేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ల కొరత ఉండటంతో మరికొన్ని వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డీసీజీఐ(Drug Controller General of India) అనుమతి లభిస్తే.. భారత్‌లో అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వి టీకా నిలవనుంది.

    రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు హైదరాబాద్‌కు కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం డాక్డర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. స్పుత్నిక్-వి టీకా భారత్‌లో వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫారసు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రతినిధి ధ్రువీకరించారు.

    ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమకు సరిపడ టీకాలు సరఫరా చేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అలాగే పలుచోట్ల కోవిడ్ వ్యాక్సిన్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో మరో కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించడం గుడ్‌ న్యూస్ అనే చెప్పాలి.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు