Corona Vaccine: మా కరోనా వ్యాక్సిన్ సూపర్.. ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్

Corona Vaccine: మా కరోనా వ్యాక్సిన్ సూపర్.. ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) అద్భుతంగా పనిచేస్తోందని రష్యా అధికారిక ప్రకటన చేసింది. కరోనాపై పోరులో స్పుత్నిక్ టీకా 92శాతం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని, ప్రజలను కోవిడ్ (covid) బారిన పడకుండా కాపాడుతున్నట్లు ప్రకటన వెలువడటం విశేషం.

  • Share this:
రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) అద్భుతంగా పనిచేస్తోందని రష్యా అధికారిక ప్రకటన చేసింది. కరోనాపై పోరులో స్పుత్నిక్ టీకా 92శాతం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని, ప్రజలను కోవిడ్ (covid) బారిన పడకుండా కాపాడుతున్నట్లు ప్రకటన వెలువడటం విశేషం. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ఆధారంగా మధ్యంతర ఫలితాలను ప్రకటించిన మాస్కో ఈ డ్రగ్ విషయంలో ఇతర దేశాల చూపును తనవైపు తిప్పుకుంది. మొత్తానికి రష్యా చేసిన ఈ తాజా ప్రకటనతో కరోనా టీకా రేసులో (corona vaccine race) తాము కూడా ఉన్నట్టు ప్రపంచానికి తేల్చి చెప్పింది. భారీ స్థాయిలో మనుషులపై జరిగిన ప్రయోగాల నేపథ్యంలో ఈ టీకా ఫలితాలు వెల్లడించడం ఓరకంగా మానవాళికి గుడ్ న్యూస్ (good news) అనే చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలు 12 లక్షలు దాటగా ఈ మహమ్మారిని అదుపు చేయాలంటే టీకా మార్కెట్లోకి రాక తప్పదనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (world economy) కుదేలు కాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సాధారణ పరిస్థితులు నెలకొనడం అత్యవసరంగా మారింది.

మొదటి దేశంగా రష్యా రికార్డు
ఆగస్టు నుంచే తమ దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. సెప్టెంబరులో పెద్ద ఎత్తున ప్రాథమిక ప్రయోగాలు మొదలు కావడానికి అనుమతులు రాకముందే రష్యన్లకు టీకాను అందుబాటులోకి తెచ్చారు.

ఇన్ఫెక్షన్లు తక్కువే..
తొలిదశలో భాగంగా16,000 మందిపై ప్రయోగించిన రెండు డోసుల వ్యాక్సిన్ పై మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా ఉన్నట్లు తేలిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్న RDIF సంస్థ ప్రకటించిన డేటా ప్రకారం ఈ టీకా వేసుకున్న 20మందిలో కోవిడ్ లక్షణాలు వచ్చాక కూడా మధ్యంతర విశ్లేషణ జరిపారు. ఫైజర్ (Pfizer) టీకా వేసుకున్నాక వచ్చిన ఇన్ఫెక్షన్ల కంటే స్పుత్నిక్ తో వచ్చిన ఇన్ఫెక్షన్లు (infections) చాలా తక్కువ. ఫైజర్ టీకా ప్రయోగంలో 94 మందిలో ఇన్ఫెక్షన్లు వచ్చాయి. కాగా రష్యన్ టీకాల ప్రయోగాలు మరో 6 నెలల పాటు కొనసాగనున్నట్టు RDIF స్పష్టంచేసింది. ప్రయోగాల ఫలితాలు, దుష్ప్రభావాల వివరాలను ప్రముఖ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించనున్నట్టు తెలిపింది.

92 శాతం సేఫ్..
మాస్కోలో 29 క్లినిక్ల ఆధ్వర్యంలో మొత్తం 40,000 మంది వాలంటీర్లపై గమాలయా ఇన్ స్టిట్యూట్ టీకాను 3వ దశ ప్రయోగాల్లో భాగంగా ప్రయోగించనున్నారు. స్పుత్నిక్ వీ టీకా వేసుకున్నవారిలో 92శాతం కోవిడ్ వచ్చే చాన్సులు లేకపోవడం హైలైట్. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నియమావళి ప్రకారం 50శాతానికి పైగా ఇది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు లెక్క. తమ టీకా 90శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు సోమవారంనాడు ఫైజర్, బయోఎన్ టెక్ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా కూడా ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. మెసేంజర్ ఆర్ఎన్ఏ (RNA) టెక్నాలజీ ఆధారంగా ఫైజర్, బయోఎన్ టెక్ తమ టీకాలను అభివృద్ధిచేసాయి. ఇందులో వ్యాధికారక వైరస్ కణజాలాలు అస్సలు ఉండవు.మనదేశంలో స్పుత్నిక్
కాగా మనదేశంలో స్పుత్నిక్ టీకా 3వ దశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా రష్యా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. దీన్ని మన ప్రభుత్వం పరిశీలిస్తుండగా, టీకా ఉత్పత్తిని కూడా మనదేశంలోనే చేసేందుకు రష్యా ఆసక్తి చూపుతోంది. దీనిపై మన ప్రభుత్వం అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే 3వ దశ ప్రయోగ పరీక్షలతో సంబంధం లేకుండానే రష్యా టీకా విడుదల చేయడం ప్రపంచదేశాల విమర్శలకు దారితీసింది. నిజానికి ఈ ప్రయోగాలను మనదేశంతో సహా మొత్తం 20 దేశాల్లో జరపాలని రష్యా సంస్థ భావిస్తోంది. తన కుమార్తెకు కూడా ఈ టీకా ఇచ్చినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) వెల్లడించడంతో ఈ టీకాకు రష్యాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీకా వేసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు, చాలా కొద్దిమందిలో మాత్రమే జలుబు వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు రష్యా ప్రకటిస్తోంది. టీకా తయారీలో అన్ని దేశాలకు సహకరిస్తామని, ఇందులో రాజకీయాలు వద్దని మొదటి నుంచీ రష్యా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు