Vaccination : వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సినేషన్ గురించి గ్రామీణ భారతం తెలుసుకోవాల్సిన విషయాలు..

Corona Vaccine : వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సినేషన్ గురించి గ్రామీణ భారతం తెలుసుకోవాల్సిన విషయాలు..

Corona Vaccine : COVID-19 (కొవిడ్ – 19) వ్యాక్సిన్ సంరక్షణ, సమర్థత గురించి కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉన్నా, దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు, వ్యాక్సిన్ల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే, భారతదేశ గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో సాంకేతికత తక్కువగా ఉన్న కారణంగా వ్యాక్సినేషన్ లేదా కొవిడ్ సహిత ప్రవర్తన (CAB) గురించి ప్రభుత్వాలు పంపిస్తున్న సందేశాలు అక్కడికి చేరడం లేదు.

 • Share this:
  ప్రపంచంలోనే అతిపెద్ద COVID-19 (కొవిడ్-19) వ్యాక్సినేషన్ల క్యాంపెయిన్లలో ఒకటైనది ప్రస్తుతం భారతదేశంలో జరుగుతోంది. ఈ క్యాంపెయిన్లో మే 6 నాటికి 16 కోట్ల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించడం జరిగింది. పాండమిక్ నుండి బయటపడటానికి వ్యాక్సిన్లే ప్రధాన దారిని చూపిస్తున్నాయి. అయినప్పటికీ, COVID-19 (కొవిడ్ – 19) వ్యాక్సిన్ సంరక్షణ, సమర్థత గురించి కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉన్నా, దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు, వ్యాక్సిన్ల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే, భారతదేశ గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో సాంకేతికత తక్కువగా ఉన్న కారణంగా వ్యాక్సినేషన్ లేదా కొవిడ్ సహిత ప్రవర్తన (CAB) గురించి ప్రభుత్వాలు పంపిస్తున్న సందేశాలు అక్కడికి చేరడం లేదు.

  కాబట్టి, వ్యాక్సినేషన్ అందించడంతో పాటు దాని అందుబాటు గురించి అవగాహన, కచ్చితమైన, పారదర్శకమైన సమాచారాన్ని, సమర్థతను, సరైన సమయంలో గ్రామీణ భారతానికి తెలియజేయడం కూడా చాలా అవసరం. దీని వల్ల వ్యాక్సిన్ గురించి ఉన్న అపోహలు తొలగిపోయి, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే వారు తీసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవడం వల్ల ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందుతుంది. సాంకేతిక సవాళ్లు, భౌగోళికంగా చేరడానికి వీలు కాని ప్రాంతాల్లో వ్యాక్సిన్ అందజేయడానికి ఉపయోగపడే వికేంద్రీకృత ప్రణాళిక కావాలి.
  సమాజంలో వ్యాక్సినేషన్ గురించి ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు, భయాలను తలదన్ని అర్హులైన వారందరికీ పెద్దఎత్తున వ్యాక్సినేషన్ అందించడం గురించి కమ్యూనిటీలకు తెలియజేయడం చాలా అవసరం. దీని కోసం, జ్ఞానాన్ని, ప్రవర్తనను, అలవాటును మెరుగుపరచడానికి ఒక విధానం అవసరం.

  వ్యాక్సినేషన్ గురించిన జ్ఞానం: గ్రామీణ ప్రాంతాల్లో, వ్యాక్సినేషన్ తీసుకోవడం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహనను కమ్యూనిటీలలో ప్రచారం చేయడం చాలా ముఖ్యం. అలాంటి ముఖ్యమైన సమాచారం లేని కారణంగా ప్రజల్లో తప్పుడు సమాచారం, పుకార్లు పుడుతున్నాయి. దీని కోసం వివిధ సామాజిక-సాంస్కృతిక నేపథ్యం గల కమ్యూనిటీలకు సందేశాలను తెలియజేయడానికి సమాచారాన్ని స్థానిక భాషలో ప్రచారం చేయాలి. అంతేకాకుండా రాష్ట్రానికి నిర్దిష్టంగా ఉన్న గ్రామీణ, ఆదివాసీ, తెగలు కాని, చేరువలో లేని వారికి తెలియజేసేలా అన్ని అంశాలను ప్రస్తావించేలా ఉండాలి.

  ప్రవర్తన: సరైన జ్ఞానం వల్ల వ్యాక్సినేషన్ గురించి సరైన ప్రవర్తన అలవడుతుంది. దీని వల్ల తప్పుడు సమాచారాన్ని ప్రజలు విశ్లేషించి, పుకార్లను పట్టించుకోకుండా ఉండగలుగుతారు.

  అలవాటు: మెరుగైన జ్ఞానం, ప్రవర్తనలు కమ్యూనిటీ సభ్యులలో వ్యాక్సిన్ కోసం ముందుకు వచ్చే చర్యను ప్రేరేపిస్తాయి. ఈ సందర్భంలో, వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవడం, సరైన సమయంలో డోస్‌లను పూర్తిచేసే సదుపాయం కలుగుతుంది.

  వ్యాక్సినేషన్ పంపిణీ చేయడంలో అతిపెద్ద సవాలు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత పరిమితంగా ఉంటుంది, ఒకవేళ సాంకేతికత ఉన్నా కూడా దాన్ని ఉపయోగించడం తెలిసిన కమ్యూనిటీలు చాలా తక్కువగా ఉంటాయి. “CO-WIN డ్యాష్‌బోర్డ్ అంటే ఏంటి?”, “నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?”, “నా అపాయింట్‌మెంట్ బుక్ చేయడం ఎలా?”, “నాకు దగ్గరలో వ్యాక్సినేషన్ కేంద్రం ఎక్కడ ఉంది?” లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. దీని వల్ల సాంకేతికత అభివృద్ధి చెంది, మెడికల్ సందేశాలు త్వరగా చేరే పట్టణ కమ్యూనిటీలతో పోల్చితే గ్రామీణ కమ్యూనిటీలలో సాంకేతిక జ్ఞానం లేకపోవడం చాలా నష్టాన్ని కలిగిస్తోంది. కమ్యూనిటీ సభ్యులకు రిజిస్ట్రేషన్ల సౌకర్యం అందించడం ద్వారా ఈ నష్టాన్ని పూరించడం ప్రధానం. గ్రామ పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల మొదలగు వారి సాయంతో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కియోస్కుల వద్ద ప్రజలు వారంతట వారే రిజిస్టర్ చేసుకునే చేయవచ్చు. అన్ని వయస్సుల వారికి వాక్ ఇన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రారంభించే వరకు ఇదే ముఖ్యమైన ప్రణాళిక. గ్రామీణ భారతంలో వ్యాక్సిన్ తీసుకోవడం సంక్లిష్ట ప్రక్రియ. అయినప్పటికీ, వికేంద్రీకరణ ప్రణాళిక, కమ్యూనిటీ ఆధారిత విధానాలతో అది సాధ్యమవుతుంది. మళ్లీ పరిస్థితులు మామూలుగా మారడానికి CABను అమలు చేయడం, వాక్సినేషన్ చేయించుకోవడం లాంటి మాత్రమే సరైనవని ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.

  --------- అనిల్ పరమర్, డైరెక్టర్, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్, NGO భాగస్వామి యునైటెడ్ వే ముంబై
  Published by:Sridhar Reddy
  First published: