రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్.. ఈ సూత్రం ఎక్కడైనా ఒక్కటే.. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ సీఐ మాస్కు వేసుకోని కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. బహిరంగ ప్రదేశానికి మాస్కు లేకుండా వచ్చిన సీఐ ను మందలించిన జిల్లా ఎస్పీ ఫైన్ వేయడంతో పాటు.. వెంటనే సీఐ మాస్కు ధరిలంచేలా చేశారు.
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా (corona) భూతం వేగంగా విజృంభిస్తోంది. ప్రతి రోజూ కేసుల సంఖ్య వేయికి పైగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో (andhra pradesh) సెకెండ్ వేవ్ విస్తరణపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. గతంలో కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. అయితే ఈసారి కరోనా అత్యంత వేగంగా విస్తరించడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాఠించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ కఠిన నిబంధనలు అమలు అయ్యేలా చూస్తున్నారు అధికారులు..
రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే.. మిగతా రాష్ట్రాలు సైతం అలర్ట్ అయ్యే ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఊహించడమే కష్టంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడే ప్రధాన లక్ష్యంగా నిబంధనలను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ కఠిన నిబంధనలు అమలు అవుతూనే ఉన్నాయి. రోడ్డు మీదకు వస్తే తప్పక మాస్క్ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాఠించాలని.. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. వీటిని తప్పక పాఠించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్పుడు కొంతైనా కరోనాని కట్టడి చేయొచ్చని భావిస్తున్నారు.
ఏపీలోనూ ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, గంటూరు, విశాఖ జిల్లాల్లో పరిస్తితి ఘోరంగా ఉంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో 70 శాతానికి పైగా ఈ మూడు జిల్లాల్లోనే ఉండడం ఆందోళన పెంచుతోంది. దీంతో మూడు జిల్లాల్లోనూ అధికారులు కఠిన నిబంధనలపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా మాస్కు లేకుండా రావొద్దని హెచ్చరిస్తున్నా ప్రజలు వినడం లేదు. భారీగా ఫైన్లు వేస్తున్నా చాలామందిలో మార్పు కనిపించడం లేదు. జన సమూహంలోనూ, షాపింగ్స్ మాల్స్ లోనూ మాస్కు లేకుండానే ప్రజలు కనిపిస్తున్నారు. ప్రజలే కాదు బాధ్యతగా ఉండాల్సిన అధికారులు సైతం కొన్ని చోట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అధికారులకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్ ఉండదు అని రుజువు చేస్తున్నాయి కొన్ని సంఘటనలు. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటూ పోలీసుకు ఫైన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుంటూరులో మాస్కు వేసుకోని ఒక సీఐకి ఫైన్ విధించారు జిల్లా ఎస్పీ. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారడంతో.. ప్రజల్లో భయం వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులకు ఫైన్ వేస్తే.. మన పరిస్థితి ఏంటని ప్రజలు భయపడే అవకాశం ఉంటుంది అంటున్నారు ఉన్నాతాధికారులు. అందుకే ముందుగా అధికారులు నిబంధనలు పాటించడమే మంచింది. లేదంటే వాళ్లకు ఇలాంటి కఠిన శిక్షలు వేయాల్సిందే. అప్పుడే అందరూ రూల్ ను పాటిస్తారు అంటున్నారు నెటిజన్లు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.