RTPCR Testing Rates: తెలంగాణలో భారీగా తగ్గిపోయిన కరోనా టెస్టుల ధరలు, దేశంలో అత్యంత చవకగా..

తెలంగాణలో కరోనా వైరస్ టెస్టుల ధరలు భారీగా తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో నిర్వహించే RTPCR టెస్టుల ధర రూ.2200 నుంచి రూ.850కి తగ్గిపోయింది.

news18-telugu
Updated: November 18, 2020, 10:01 PM IST
RTPCR Testing Rates: తెలంగాణలో భారీగా తగ్గిపోయిన కరోనా టెస్టుల ధరలు, దేశంలో అత్యంత చవకగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ టెస్టుల ధరలు భారీగా తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో నిర్వహించే RTPCR టెస్టుల ధర రూ.2200 నుంచి రూ.850కి తగ్గిపోయింది. అలాగే, ఇంటి వద్ద కలెక్ట్ చేసే RTPCR టెస్టు ధర రూ.2800 నుంచి రూ.1200కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కరోనా టెస్టులు మాత్రం ఉచితం. ప్రస్తుతం తెలంగాణలోని 1076 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తోంది. అలాగే, రాష్ట్రంలో 18 RTPCR టెస్టులు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్, 50 ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 3000 నుంచి 4000 వరకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి.

కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్ల ధర తయారీ ఖర్చులు గతంతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తగ్గాయి. కరోనా ప్రారంభమైన కొత్తలో ఉన్న ధరల కంటే చౌక ధరలకే పీపీఈ కిట్లు లభిస్తున్నాయి. కరోనా టెస్ట్ కిట్లు తయారవుతున్నాయి. ఈ క్రమంలో ఆ తగ్గిన ధరల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు, ప్రజలకు చేరాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రారంభమైన తర్వాత , ప్రైవేట్ ల్యాబ్స్‌లో టెస్టింగ్‌లకు ప్రభుత్వం ధర నిర్ణయించిన తర్వాత రాష్ట్ర సర్కారు ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. దేశంలోని పలు రాష్ట్రాలు ధరల్లో సవరణలు చేసుకుంటూ వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ధరలు భారీగా తగ్గాయని, అత్యంత చవకగా కరోనా టెస్టులు చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చోట సాధించిందని చెబుతున్నారు.

తెలంగాణలో 13,068 కరోనా యాక్టివ్ కేసులు

తెలంగాణలో నిన్న కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. అలాగే నిన్న 5గురు కరోనాతో చనిపోవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 1415కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. దేశంలో అది 1.5 శాతంగా ఉంది. తెలంగాణలో నిన్న 1607 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,45,293కి చేరింది. అందువల్ల రికవరీ రేటు 94.42 శాతంగా ఉంది. ఇండియాలో అది 93.5 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 13,068 ఉండగా... వాటిలో 10,710 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. నిన్న తెలంగాణ ఆరోగ్య శాఖ 42,433 టెస్టులు చేయించింది. ఇదివరకు ఇన్ని టెస్టులు చేయిస్తే... కొత్త కేసులు 1400 దాకా వచ్చేవి. ఇప్పుడు వెయ్యి లోపే వచ్చాయంటే దాని అర్థం... తెలంగాణలో కరోనా తగ్గుతోంది అనే. ప్రస్తుతం మొత్తం టెస్టుల సంఖ్య 49,72,407కి చేరింది. 807 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.

జిల్లాల్లో నిన్న కొత్త కేసుల్ని గమనిస్తే... GHMCలో 154 వచ్చాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 83, రంగారెడ్డి జిల్లాలో 76 వచ్చాయి. ఈ జిల్లాల్లో ప్రజలు మరికొన్ని రోజులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 18, 2020, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading