Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆర్టీఏ గుడ్ న్యూస్... జూలై 1 నుంచి..

ఏపీ ప్రజలకు ఆర్టీఏ గుడ్ న్యూస్

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు ఆర్టీఏ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జులై 1 నుంచి లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే అందుకు కొన్ని కండిషన్లు పెట్టారు.

  • Share this:
    ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రావాణా శాఖ.. చాలా రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా కొత్త లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వడం లేదు. ఇక కరోనా కోరణంగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో పూర్తిగా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ సమయంలో కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి, ఆ సమయంలో పరీక్షలు నిర్వహించడం మంచింది కాదని అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ కారణంగా మే నుంచి లెర్నర్, డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు పూర్తిగా నిలిపివేశారు. అయితే సోమవారం నుంచి ఏపీ వ్యాప్తంగా సడలింపులను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇకపై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ్యం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నింటికీ అనుమతి ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా అంటే సాధారణ సమయాల్లో మాదిరి పని చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అన్ని సేవలు ప్రారంభించినప్పటికే.. ప్రధానంగా చాలా జిల్లాల్లో జులై 1 నుంచి లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు.

    జులై 1 నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయితే ముందుగా ఒక్కసారిగా కార్యాలయాలు తెరుచుకోవడంతో డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంది. దీంతో కొన్ని నిబంధనలు తప్పక అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు...

    ఆయా జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలు తెరిచే ఉంచినా.. అన్ని చోట్ల కరోనా నిబంధనలు తప్పక అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు లేనిదే ఎవరిని అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే సోషల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. టైం స్లాట్ ను పక్కా అమలు అయ్యేలా చూడాలని నిర్ణయించారు. అలాగే మే, జూన్‌లలో స్లాట్లు పొందిన వారికి ముందుగా అవకాశం ఇవ్వనున్నారు. వారం రోజుల్లో వీరంతా తమకు వీలున్న తేదీని రవాణాశాఖ పోర్టల్‌లోనే ఎంపిక చేసుకుని స్లాట్‌ పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

    దీంతో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే లైసెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే ముందుగానే స్టాట్ బుక్ చేసుకుని.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్థానిక ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి డ్రైవింగ్ టెస్టులో పాస్ అయితే.. ఈజీగా లైసెన్స్ పొందుచ్చు..
    Published by:Nagesh Paina
    First published: