లాక్‌డౌన్‌లో షాపులు తెరిచినందుకు... రూ.లక్ష ఫైన్... ఎక్కడంటే...

దేశంలో అన్‌లాక్-3 అమల్లో ఉన్నా... కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠినంగానే అమలవుతోంది. అలాంటి ఓ చోట రూ.లక్ష ఫైన్ ఎందుకు వేశారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 2, 2020, 11:48 AM IST
లాక్‌డౌన్‌లో షాపులు తెరిచినందుకు... రూ.లక్ష ఫైన్... ఎక్కడంటే...
లాక్‌డౌన్‌లో షాపులు తెరిచినందుకు... రూ.లక్ష ఫైన్.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో రోజూ పది వేల దాకా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. దాంతో... లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొన్నిచోట్ల అత్యవసర, నిత్యవసరాలు మాత్రమే అమ్మేందుకు అనుమతి ఇస్తున్నారు. అది కూడా ఉదయం 10 గంటల వరకే. మరికొన్ని చోట్ల అన్ని రకాల షాపులూ తెరవొచ్చంటూనే... ఉదయం 10 గంటలకు మూసేయాలని కండీషన్ పెడుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం 11 గంటల వరకూ అనుమతిస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో... కండీషన్లు చాలా కఠినంగా అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొంత మంది వ్యాపారులు... టైమ్ దాటిన తర్వాత కూడా షాపులు క్లోజ్ చెయ్యట్లేదు.

తాజాగా నెల్లూరు జిల్లా... వెంకటగిరిలో... రూల్స్‌కి విరుద్ధంగా తెరచివున్న షాపులకు మూడు రోజులుగా రూ.5000 చొప్పున రూ.లక్ష దాకా ఫైన్ వేసినట్లు వెంకటగిరి ఎస్సై ఎం.వెంకటరాజేష్ తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే రూ.5000 ఫైన్ వేస్తామనీ... రెండోసారీ అలాగే చేస్తే... షాపును సీజ్ చేసి... నాన్ బెయిలబుల్ కేసు రాస్తామని ఆయన వివరించారు.

షాపులే కాదు... ప్రజలకు కూడా ఆయన హెచ్చరిక లాంటి అప్రమత్త సందేశం ఇచ్చారు. బయటకు వచ్చే వారు... తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెపపారు. లేదంటే రూ.500 ఫైన్ వేస్తామన్నారు. ఇవాళ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండటంతో... వ్యాపారులు అస్సలు షాపులు తియ్యలేదు. తీసినా పెద్దగా వ్యాపారం జరగట్లేదు. దానికి ఈ ఫైన్లు చెల్లించడం పెను భారమే. కానీ కరోనా కంట్రోల్ కావాలంటే... ఈ మాత్రం కఠినత్వం తప్పందంటున్నారు పోలీసులు.

మన దేశంలో పూర్తి లాక్‌డౌన్ ఉన్న సమయంలో కరోనా కేసులు చాలా చాలా తక్కువ ఉండేవి. ఎప్పుడైత్ అన్‌లాక్-1 మొదలైందో... ఆ తర్వాత 2 వారాల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే... ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందంటే... ఎంత ప్రమాదంలో ఉన్నామో గ్రహించవచ్చు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading