కరోనా పై రాజమౌళి సంచలన ట్వీట్.. దాని కోసమేనా..

చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో ప్రపంచమే స్థంభించి పోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కరోనాపై రాజమౌళి సంచలన ట్వీట్ చేసాడు.

news18-telugu
Updated: March 16, 2020, 3:03 PM IST
కరోనా పై రాజమౌళి సంచలన ట్వీట్.. దాని కోసమేనా..
దర్శకుడు రాజమౌళి (Rajamouli)
  • Share this:
చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  మన దేశాలతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో లక్షలకు లక్షల కోట్లు ఆవిరిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి మన దేశంతో పాటు హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జనాల్లో ఒక రకమైన అభద్రత భావం నెలకొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు జన సమ్మర్థం ఎక్కువగా ఉండే స్కూల్స్, కాలేజ్స్, థియేటర్స్, పబ్స్, బార్స్, జిమ్స్‌ను బంద్ చేయాలని జీవో పాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కేరళ, కర్ణాటక, ధిల్లీ రాష్ట్రాలు అదే బాటలో పయనించాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో ప్రపంచమే స్థంభించి పోయే పరిస్థితి ఏర్పడింది. చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని ఆర్డర్స్ వేసాయి. తాజాగా కరోనాపై రాజమౌళి సంచలన ట్వీట్ చేసాడు. కరోనా కారణంగా ప్రపంచమే స్థంభించి పోవడం చూస్తుంటే షాకింగ్‌గా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రామాణికంగా ఏమి చేయాలో అది చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాలో చాలా మంది ఫారెన్ నటులు నటిస్తున్నారు. తాజాగా కేంద్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశీయులకు సంబంధించిన వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై దాని ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ రాజమౌళి తెలిసి చేసాడో.. తెలియక చేసాడో కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడం మంచికే జరిగిందన్నారు. ఇపుడు కరోనా ఎపెక్ట్‌తో మరోసారి ఈ సినిమాకు సంబంధించిన


విదేశీయుల వీసాల‌ని కేంద్రం త్కాలిక‌ ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి ప‌లు ఆటంకాలు క‌లిగే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ సారి రిలీజ్ డేట్‌ని పోస్ట్ పోన్ చేసిన రాజ‌మౌళి మ‌ళ్లీ ఆ తేదీని మారుస్తాడా అన్న‌ది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 16, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading