పీఎం కేర్స్‌కు రష్యన్ కంపెనీ రూ.15 కోట్ల విరాళం..

పీఎం కేర్స్‌కు రష్యన్ కంపెనీ రూ.15 కోట్ల విరాళం..

పుతిన్‌తో మోదీ, ఫైల్ ఫోటో (Image: PIB/PTI)

PM Cares : కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కేర్స్ ఫండ్‌కు వెల్లువలా విరాళాలు అందుతున్నాయి. అయితే, తొలిసారి ఓ విదేశీ కంపెనీ పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించింది.

 • Share this:
  PM Cares : కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కేర్స్ ఫండ్‌కు వెల్లువలా విరాళాలు అందుతున్నాయి. అయితే, తొలిసారి ఓ విదేశీ కంపెనీ పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆయుధాల కంపెనీ రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్ రూ.15.3 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ నుంచి ఇండియా ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోందని, అందుకే ఈ విరాళాన్ని ప్రకటించామని వెల్లడించింది. అందుకు సంబంధించి డబ్బును కూడా పీఎం కేర్స్‌కు బదిలీ చేసిందా కంపెనీ. ఈ మొత్తాన్ని మెడికల్ పరికరాలు, వైద్య సిబ్బంది రక్షక కవచాలు కొనేందుకు వాడాలని కేంద్రాన్ని కోరింది. కాగా, ఈ కంపెనీ నుంచి ఎస్400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థల కొనగోలుకు 2018 అక్టోబరులో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.

  వాస్తవానికి ప్రధాని సహాయనిధికి విదేశీ విరాళాలను కేంద్రం అంగీకరించదు. కానీ.. పీఎం కేర్స్ ద్వారా విదేశాల్లోని ఎన్ఆర్‌ఐలు, పీఐఓలు, అంతర్జాతీయ సంస్థలు, పలు ఏజెన్సీల నుంచి విరాళాలు సేకరిస్తోంది. 2018 ఆగస్టులో కేరళలో వరదలు వచ్చినప్పుడు యూఏఈ, ఖతార్, మాల్డీవులు ప్రకటించిన విరాళాలను కేంద్రం తోసిపుచ్చింది. 2004 డిసెంబరులో సునామీ వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశాల నుంచి విరాళాలు తీసుకోవడానికి నిరాకరించారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు