కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు నర్సుల స్థానంలో రోబోలు అందుబాటులోకి వచ్చాయి. జైపూర్లోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఈ రోబోలను ప్రవేశపెట్టారు.
జైపూర్లోని ఓ ఆస్పత్రికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స చేసేందుకు రోబోలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్లో కరోనా వైరస్ సోకిన వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో రోగులకు చికిత్స అందించేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జోద్పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ నర్సింగ్ రోబోలను తయారు చేశారు. ఏలాంటి ఛార్జీలు తీసుకుకోకుండా హాస్పిటల్ పనిచేసేందుకు తీసుకొచ్చారని చెప్పారు.
ఒక్కో రోబో జీవిత కాలం 4 నుంచి 5 సంవత్సరాలు ఉండనుందని వైద్యులు తెలిపారు. ఇవి పూర్తిగా బ్యాటరీ సాయంతో పనిచేయనున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు చికిత్స అందించేందుకు నర్సుల స్థానంలో ఈ రోబోలు సేవలు అందించనున్నాయి. బుధవారం ఐసోలేషన్ వార్డుల్లో ఈ రోబోలు విజయవంతంగా చికిత్స అందించాయి. ఈ రోబోలను ప్రవేశపెట్టడం వల్ల నర్సులకు కరోనా వైరస్ సోకకుండా సురక్షితంగా ఉండే వీలుందని వైద్యులు తెలిపారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.