REVISED GUIDELINES FOR LOCKDOWN BANK BRANCHES TO REMAIN OPEN TILL DIRECT BENEFIT TRANSFERS ARE COMPLETE SS
Lockdown Guidelines: బ్యాంకులు ఎప్పటివరకు తెరిచి ఉంటాయంటే...
Lockdown Guidelines: బ్యాంకులు ఎప్పటివరకు తెరిచి ఉంటాయంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
Revised guidelines for lockdown | బ్యాంకులో ముఖ్యమైన పనులు ఏవైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం సవరించిన గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకు కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
భారతదేశంలో మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని ప్రకటించారు కూడా. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ని కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసింది. అందులో బ్యాంకుల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకు బ్రాంచ్‌లు సాధారణ పనివేళల్లో తెరిచి ఉండేందుకు అనుమతి లభించింది. అయితే ఇది నగదు బదిలీ పూర్తయ్యేవరకు మాత్రమేనని హోమ్ శాఖ స్పష్టంగా తెలియజేసింది. బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంలు, బ్యాంకు నిర్వహణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించేవారు, బ్యాంక్ కరస్పాండెంట్స్, ఏటీఎం నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు ఎంపిక చేసిన కార్యకలాపాలు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఉంది. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా స్థానిక అధికార యంత్రాంగం సెక్యూరిటీ కల్పించాలని హోమ్ శాఖ ఆదేశించింది.
ఆర్థిక రంగంలో బ్యాంకులు, ఏటీఎంలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI, సెబీ నోటిఫై చేసిన క్యాపిటల్, డెట్ మార్కెట్లు, ఐఆర్డీఏఐ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఎన్పీసీఐ, సీసీఐఎల్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కార్యకలాపాలు సాగిస్తాయి. అయితే సవరించిన ఈ గైడ్‌లైన్స్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా అధికారులు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లల్లో వర్తించవు. ఒకవేళ కంటైన్మెంట్ జోన్‌గా ఏదైనా కొత్త ప్రాంతాన్ని గుర్తిస్తే ఆ ప్రాంతంలో సవరించిన గైడ్‌లైన్స్ అన్నీ రద్దవుతాయని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన గైడ్‌లైన్స్ అమలులోకి వస్తాయని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.