Home /News /coronavirus-latest-news /

RESOLUTION PASSED IN ANDHRA PRADESH ASSEMBLY AGAINST THE PRIVATIZATION OF THE STEEL PLANT NGS

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కార్మికులకు ఊరట... ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం.. ఆమోదం తెలిపిన అసెంబ్లీ

విశాఖ ఉక్కు కార్మికులకు ఊరట

విశాఖ ఉక్కు కార్మికులకు ఊరట

విశాఖ ఉక్కు కార్మికులకు కాస్త ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం మాట ఇచ్చినట్టు ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టి ఆమోదించింది.. ఈ తీర్మానంతోనైనా కేంద్రం మనసు మారుతుందని ఉక్కు కార్మికులు ఆశిస్తున్నారు.

    విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదాం మొన్నటి వరకు ఏపీకి పరిమితమైనా.. ఇప్పుడు దేశవ్యాప్తమైంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. దేశంలో విపక్ష పార్టీలు సైతం కేంద్రం నిర్ణయాన్ని తప్పు పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆక్సిజన్ అందక మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి కష్ట కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందరికో ఊపిరి అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలకు అనుగుణంగా కేంద్రం సూచనలతో భారీగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఏపీకి మాత్రమే పరిమితం కాకుండా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తోంది. ఓ వైపు ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం ఊపిరి తీయాలని చూస్తుంటే.. అదే సమయంలో ఎందరికో ఊపిరి పోస్తూ స్టీల్ ప్లాంట్ ఘనత సాధించింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపేయాలనే డిమాండ్ మరింత పెరిగింది.

    మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సైతం కేంద్రం తీరును తప్పు పట్టారు. దేశానికి ఊపిరి అందిస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ఎంత వరకు సరైన నిర్ణయం అంటూ కేంద్రానికి చురకలు అంటించారు చిరంజీవి. అలాగే దేశ వ్యాప్తంగా అందిరిదీ ఇదే అభిప్రాయం. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ప్రజల అవసరాలకు తగ్గట్టు ఆక్సిజన్ అందిస్తోంది అని.. అదే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే.. వారు చెప్పిన రేటుకు ఆక్సిజన్ ను కొనసాల్సి వచ్చేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వెనక్కు తగ్గినట్టు కనిపించలేదు..

    తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశెపెట్టింది. దాన్ని అసెంబ్లీ ఏక గ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పటికే రిలే నిరహార దీక్షలకు 90 రోజులు దాటింది. ఓ వైపు కరోనా భయపెడుతోంది. మరోవైపు కష్ట కాలంలో విధులు నిర్వహించక తప్పడం లేదు. ఇలాంటి సమయంలోనూ పని చేస్తూనే కార్మికులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. వారి ఆందోళనలకు కార్మిక, విద్యార్థి రాజకీయ సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి.

    కేంద్రం మాత్రం పదే పదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేల్చి చెపుతోంది మొదటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమణ దీనిపై ప్రకటన చేస్తే.. తరువాత మరో కేంద్రమంత్రి ధర్మాంద్ర ప్రధాన్ సైతం అదే విషయాన్ని స్పష్గం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తూనే ఉంది. స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ పరిశ్రమలను కూడా ప్రైవేటీకరించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించేలా చేశారు. దీన్ని కేంద్రానికి పంపనున్నారు. ఆ తరువాతైనా కేంద్రం మనసు మారుతుందో లేదో చూడాలి..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Assembly, AP News, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు