HOME »NEWS »Corona vilayatandavam »republic day 2021 covid 19 vaccine development process to be showcased in republic day parade su gh

COVID Vaccine - Republic Day 2021: రిపబ్లిక్ డే పరేడ్ లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ ప్రదర్శన

COVID Vaccine - Republic Day 2021: రిపబ్లిక్ డే పరేడ్ లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ ప్రదర్శన
ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్ల(Corona Vaccine) పంపిణీ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. జనవరి 16న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

  • Share this:
కరోనా వ్యాక్సిన్ల(Corona Vaccine) పంపిణీ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. జనవరి 16న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని రాజ్ పథ్ లో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కోవిడ్-19(COVID-19) వ్యాక్సిన్ ను ఎలా అభివృద్ధి చేశారనేది ప్రదర్శించనున్నారు. రిపబ్లిక్ డే పెరెడ్ లో కరోనా వ్యాక్సిన్ తయరీ విధాన్ని ప్రదర్శించనున్నారు. ఇక, భారత్ లో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ప్రజలకు అందజేస్తున్నారు. 2021 జనవరి 16న ప్రారంభించిన ఈ పంపిణీ విజయవంతంగా జరుగుతోంది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా 1,53,052 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అంతేకాకుండా భారత్ లో 1,06,25,428 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సైన్ అండ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం వ్యూహాత్మక పద్ధతులను అవలంభించడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఎంతో అవసరమయ్యే సాముహిక పరివర్తనా ద్వారా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యం చేసింది.

కోవిడ్-19 వ్యతిరేకంగా పోరాటానికి థీమ్ వచ్చేసి ఆత్మ నిర్భర్ భారత్ అభియన్(స్వావలంభన భారత ప్రచారం). వివిధ ప్రక్రియల ద్వారా టీకా అభివృద్ధి ప్రక్రియను పట్టిక వర్ణిస్తుంది. ట్రాక్టర్ పోర్షన్ కోవిడ్ వ్యాక్సిన్ తో శాస్త్రవేత్తల విగ్రహాన్ని సూచిస్తుంది. మానవాళిని రక్షించడానికి చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. ట్రైలర్ పోర్షన్ ను ఐదు విభాగాలుగా విభజించారు. మొదట క్యాబిన్ షోలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్.. వైరస్ ఐసోలేషన్, క్యారెక్టరైజేషన్ ప్రక్రియను వివరిస్తుంది. రెండో క్యాబిన్ సెల్ సెపరేటర్.. సెల్ గ్రోవర్, వైరస్ నిల్వ వ్యవస్థను పెద్ద ఎత్తున వైరస్ ప్రచారం, ఉత్పత్తిని వర్ణిస్తుంది.



Republic Day 2021: గణతంత్రదినోత్సవం పరేడ్‌లో ఆయోధ్య రామమందిరం నమూనా శకటం

Republic Day 2021: ప్లాస్టిక్‌ జాతీయ జెండా నిషేధం.. రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు

మూడో క్యాబిన్ టీకా పరిశోధన ప్రయోగశాలను చూపిస్తుంది. నాలుగో క్యాబిన్ బయోరియాక్టర్స్, టీకా ఉత్పత్తిని చూపిస్తుంది. ఐదో క్యాబిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చూపిస్తారు. క్యాబిన్ వెలుపల మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రదర్శించబడుతుంది. సామాజిక ఔచిత్యంతో వినూత్న ఉత్పత్తి అభివృద్ధిని ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై బయోటెక్నాలజీ విభాగం దృష్టిసారించిందని ఆ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. స్వదేశీ వ్యాక్సిన్లు, నోవెల్ పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నస్టిక్స్ పరిశోధన వనరుల స్థాపన, సేవలను అందించే సాంప్రదాయ జ్ఞానం ఆధారంగా చికిత్సా సూత్రీకరణల అభివృద్ధిఅవుతుందని ఆయన అన్నారు.
Published by:Sumanth Kanukula
First published:January 23, 2021, 12:24 IST

टॉप स्टोरीज