ఈ కరోనా ఔషధం వీర్యకణాలపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్...

యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెండెసివిర్‌ మానవ వీర్య కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని చైనాలోని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

news18-telugu
Updated: May 1, 2020, 8:44 AM IST
ఈ కరోనా ఔషధం వీర్యకణాలపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా రోగులకు అందిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెండెసివిర్‌ మానవ వీర్య కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని చైనాలోని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట తాము ఎలుకలపై ప్రయోగాలు జరిపామని.. వాటిల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామని నిర్ధారించామన్నారు. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ నివారణ సామర్థ్యం కలిగిన జౌషధాల్లో రెమ్‌డెసివిర్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అమెరికా ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని కరోనా రోగులపై పరీక్షించగా సత్ఫలితాలు కనిపించాయి. ఇండో-అమెరికన్ ఫిజీషియన్‌తో సహా పరిశోధకుల బృందం మూడో దశ ట్రయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని ఫార్మా కంపెనీ వెల్లడించింది. కాలిఫోర్నియా కేంద్రం గల ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ ఈ ఫలితాల గురించి వివరిస్తూ కరోనా రోగుల్లో 50 శాతం మందిని రెమ్‌డెసివిర్ ఐదు రోజుల డోస్‌లతో చికిత్స చేయగా చాలా పురోగతి కనిపించిందని వారిలో సగానికి సగం మందిని ఆస్పత్రి నుంచి రెండు వారాల్లో డిశ్చార్జి చేశామని తెలిపింది.

రెండెసివిర్ గతంలో ఎబోలా వైరస్ నివారణకు దీన్ని నివారించారు. వైరస్ ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎ లోని మూలకాలను పోలి ఉండే ఈ ఔషధం వైరస్ పునరుత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇతర ఔషధాలు మనిషి లోని రోగ నిరోధక శక్తిలో మార్పులు తీసుకొచ్చి వైరన్‌ను అడ్డుకునేలా చేస్తే ఈ ఔషధం మాత్రం వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది.
First published: May 1, 2020, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading