Home /News /coronavirus-latest-news /

REMDESIVIR IS NOT A LIFE SAVING DRUG ICMR SUGGESTS SAFE USE OF ANTIVIRAL DRUG IN COVID 19 TREATMENT SK

Remdesivir: రెమిడిసివిర్ ప్రాణాలు కాపాడదు.. అనవసరంగా ఎగబడొద్దు.. ICMR కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెమిడిసివిర్ డ్రగ్ కోసం అవనసరంగా ఎగబడవద్దని ఆ మందు ప్రాణాలను కాపాడలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. రెమిడిసివర్ డ్రగ్‌కు జాగ్రత్తగా, హేతుబద్ధంగా వాడాలని.. ఎలా పడితే అలా ఉపయోగిస్తే ముప్పు తప్పదని హెచ్చరించింది.

    కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రెమెడిసివిర్ (Remdesivir) యాంటీ వైరల్ డ్రగ్‌కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కరోనా రోగులు లక్షల్లో పెరుతుండడంతో ఆస్పత్రుల్లో ఈ డ్రగ్‌ కొరత ఏర్పడింది. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రెమిడివిసివర్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. రూ.2 నుంచి 3 వేలు పలికే రెమిడిసివిర్ ఇంజెక్షన్‌ను రూ.30 నుంచి 40వేలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో రెమిడిసివర్ యాంటీ వైరల్ డ్రగ్‌పై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. రెమిడిసివిర్ డ్రగ్ కోసం అవనసరంగా ఎగబడవద్దని ఆ మందు ప్రాణాలను కాపాడలేదని స్పష్టం చేసింది. రెమిడిసివర్ డ్రగ్‌కు జాగ్రత్తగా, హేతుబద్ధంగా వాడాలని.. ఎలా పడితే అలా ఉపయోగిస్తే ముప్పు తప్పదని హెచ్చరించింది.

    రెమిడిసివిర్ కేవలం ప్రయోగాత్మక పరిశోధాత్మక మందు మాత్రమేనని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీనివి వాడాలని సూచించింది. ఆస్పత్రిలో ఉండే సమయాన్ని మాత్రమే తగ్గించగలదని.. అంతేతప్ప ప్రాణాలను కాపాడలేదని క్లారిటీ ఇచ్చింది. ఐసీఎంఆర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్న వారే ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యం పాలైన 10 రోజుల్లో 5 రోజుల పాటు మాత్రమే ఇంజెక్షన్ వేసుకోవాలి. అవసరం రెమెడిసివర్ ఇంజెక్షన్ తీసుకోవడం ప్రమాదకరం. రెండు రోజుల క్రితం ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రెమిడిసివర్ మ్యాజిక్ బుల్లెట్ కాదని.. ఇది మరణం నుంచి కాపాడలేదని స్పష్టం చేశారు. వేరే యాంటీ వైరల్ డ్రగ్ లేకపోవడం వల్లే ఈ ఇంజెక్షన్‌ను వాడుతున్నామని తెలిపారు.

    రెమిడిసివిర్ డ్రగ్‌కు డిమాండ్ పెరగడంతో.. కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. మందుల కొరత లేకుండా ఉండడంతో పాటు ధరలను తగ్గించాలని ఔషధ కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్ంయలో కేంద్రం సూచనల మేరకు రెమెడిసివిర్ ఇంజెక్షన్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను తగ్గించాయి. 100 మిల్లీ గ్రాముల రెమెడిసివర్ ఇంజెక్షన్ ధరలను సవరించడంతో.. దాదాపు 50శాతం మేర ధరలు తగ్గాయి. క్యాడిలా హెల్త్ కేర్ ఇంజెక్షన్ రెమ్‌డాక్ (REMDAC) ధర గతంలో రూ.2,800 ఉండగా ప్రస్తుతం రూ.899కు తగ్గింది. సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇంజెక్షన్ రెమ్‌విన్ (Remwin) ధర గతంలో రూ.3,950 ఉండగా.. ప్రస్తుతం రూ.2,450కి దొరుకుతోంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన రెమిడిసివర్ ఇంజెక్షన్ రెడిక్స్ (REDYX) ధర గతంలో రూ.5,400 ఉండగా.. ప్రస్తుతం రూ.2,700కు అందుబాటులో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona cases, Corona virus, Coronavirus, Covid-19, ICMR, Remdesivir

    తదుపరి వార్తలు