COVID-19 Insurance: రిలయెన్స్ నుంచి ఇన్స్యూరెన్స్ ప్లాన్... ఉద్యోగం పోయినా కవరేజీ

COVID-19 Insurance: రిలయెన్స్ నుంచి ఇన్స్యూరెన్స్ ప్లాన్... ఉద్యోగం పోయినా కవరేజీ

COVID-19 Insurance: రిలయెన్స్ నుంచి ఇన్స్యూరెన్స్ ప్లాన్... ఉద్యోగం పోయినా కవరేజీ (ప్రతీకాత్మక చిత్రం)

Reliance COVID-19 protection | కరోనావైరస్ బారినపడతామన్న భయం ఉందా? కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగానికి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా? ఇవన్నీ కవర్ అయ్యేలా రిలయెన్స్ కోవిడ్ 19 ప్రొటెక్షన్ ప్లాన్ ప్రకటించింది.

  • Share this:
    రిలయెన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కోవిడ్ 19 ప్రొటెక్షన్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చిన వారికి బీమా 100 శాతం ఇవ్వడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ఒకవేళ పాలసీహోల్డర్ క్వారెంటైన్‌లోకి వెళ్తే బీమా మొత్తంలో 50 శాతం పొందొచ్చు. ఈ పాలసీ గడువు ఏడాది. 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాత నుంచి కవరేజీ మొదలవుతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎదురయ్యే ఆర్థిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ లంప్‌సమ్ పాలసీ రూపొందించామని కంపెనీ సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాకేష్ జైన్ తెలిపారు.

    మూడు నెలల నుంచి 60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వారెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. బీమా ఆప్షన్ రూ.25,000 నుంచి రూ.2,00,000 వరకు ఉంటుంది. కేవలం కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ ఇవ్వడం మాత్రమే కాదు... కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగం కోల్పోయిన, జీతం కోల్పోయినా కవరేజీ పొందొచ్చు. ఇందుకోసం యాడ్ ఆన్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. కరోనా వైరస్ కవరేజీ ఇచ్చే ఇన్స్యూరెన్స్ పాలసీలు మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే ఉద్యోగం కోల్పోయినా కవరేజీ ఇవ్వడం ఈ పాలసీ ప్రత్యేకత.

    ఇవి కూడా చదవండి:

    Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్

    Arogya Sanjeevani: ఆరోగ్య సంజీవని పాలసీ ప్రారంభంచిన బజాజ్ అల్లియాంజ్... బెనిఫిట్స్ ఇవే

    Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...

    Aadhaar Services: ఈ 7 ఆధార్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published: