Home /News /coronavirus-latest-news /

దేశంలోనే ఫస్ట్ కోవిడ్ 19 ఆస్పత్రి... రిలయన్స్ సహకారంతో ఏర్పాటు...

దేశంలోనే ఫస్ట్ కోవిడ్ 19 ఆస్పత్రి... రిలయన్స్ సహకారంతో ఏర్పాటు...

దేశంలో తొలి కోవిడ్ 19 ఆస్పత్రి

దేశంలో తొలి కోవిడ్ 19 ఆస్పత్రి

దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకించి కరోనా పేషెంట్ల కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి సిద్ధమైంది.

    కరోనా వైరస్ బాధితుల కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా ఆస్పత్రి సిద్ధమైంది. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో సెవన్ హిల్స్ హాస్పటల్ రూపుదిద్దుకుంది. ఇందులో 100 బెడ్స్ ఉంటాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకకుండా, ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా నివారించేందుకు భారీ ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పడుతున్న కష్టాన్ని, వారి త్యాగాలను సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ గుర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు,దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మీద పోరాడుతున్న వైద్య సిబ్బంది అందరు సేవలనూ గుర్తిస్తుందని తెలిపింది. ‘రేపటి దివ్యమైన భవిష్యత్తు కోసం ఈరోజు వారు చేస్తున్న త్యాగం, సేవలను మరువలేం. వారి నాయకత్వం, సేవ ప్రశంసనీయం. మనం కూడా వారి బాటలో నడుద్దాం. దేశ సేవలో పాలుపంచుకుందాం ’ అని రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పేర్కొంది.



    ఈ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకోవడం కూడా మొదలు పెట్టారు. వైద్యులు విధుల్లో ఉన్న వీడియోలను రిలయన్స్ హస్పటల్ సోషల్ మీడియాలో పంచుకుంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Covid-19, Reliance Foundation, Reliance Industries

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు