రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఇదీ..

Red Zone, Orange Zone, Green Zone : ఎల్లుండి లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశంలోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది.

news18-telugu
Updated: May 1, 2020, 10:01 AM IST
రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఇదీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Red Zone, Orange Zone, Green Zone : ఎల్లుండి లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశంలోని మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. అందులో 130 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాత కూడా కఠిన నిబంధనలను అమల్లో ఉంచనున్నారు. మిగతా చోట్ల పాక్షికంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని జిల్లాలతో కూడిన జోన్ల నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అందులో తెలంగాణలోని 6 జిల్లాలు, ఏపీలోని 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.

తెలంగాణ:

రెడ్ జోన్
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్
నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్ జోన్పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి,

ఆంధ్రప్రదేశ్:
రెడ్ జోన్
కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు,
ఆరెంజ్ జోన్
పశ్చిమ గోదావరి, కడప, అనంతపూర్, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం,
గ్రీన్ జోన్
విజయనగరం

రాష్ట్రాల వారీగా జోన్లు
First published: May 1, 2020, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading