హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid cases: కోవిడ్ విజృంభ‌న‌కు కార‌ణ‌మిదేనా.. ? ఆ త‌ప్పులే ఇప్పుడు మ‌న‌ల్ని హ‌డ‌లెత్తిస్తున్నాయా..?

Covid cases: కోవిడ్ విజృంభ‌న‌కు కార‌ణ‌మిదేనా.. ? ఆ త‌ప్పులే ఇప్పుడు మ‌న‌ల్ని హ‌డ‌లెత్తిస్తున్నాయా..?

Covid cases: తెలంగాణ‌లో కోవిడ్ సెకండ్ వేవ్ హడ‌లేత్తిస్తోంది. రోజూ వేల సంఖ్య‌లో కోవిడ్ కేసులు న‌మోదు కావ‌డం ఇప్పుడు అంద‌ర్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే కోవిడ్ విజృంభ‌న కారణంగా స్కూల్స్, కాలేజ్ ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఈ ఏడాది జ‌ర‌గాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రిక్ష‌లు కూడా వాయిదా వేసింది. అయితే ఒక్క‌సారిగా కోవిడ్ ఈ స్థాయిలో పెర‌గ‌డానికి నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కారణమని వైద్యులు అంటున్నారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ‌లో కోవిడ్ సెకండ్ వేవ్ హడ‌లేత్తిస్తోంది. రోజూ వేల సంఖ్య‌లో కోవిడ్ కేసులు న‌మోదు కావ‌డం ఇప్పుడు అంద‌ర్ని ఆందోళ‌న‌కు గురిస్తోంది. ఇప్ప‌టికే కోవిడ్ విజృంభ‌న కారణంగా స్కూల్స్, కాలేజ్ ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఈ ఏడాది జ‌ర‌గాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రిక్ష‌లు కూడా వాయిదా వేసింది. గ‌త ఏడాది ఇదే నెల‌లో ఎలాంటి ప‌రిస్థితిలు నెల‌కున్నాయో ప్ర‌స్తుతం అంత కంటే ఎక్కువగా కోవిడ్ వ్యాప్తి తెలంగాణ వ్యాప్తంగా జ‌రుగుతంది. శుక్ర‌వారం ఒక్క రోజే 3,800 పైగా కేసులు న‌మోదు కావ‌డం ఇటు అధికారుల్లో అంటు సామాన్యూల్లో కూడా ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. గ‌త నెల వ‌ర‌కు ప‌రిస్థితి కాస్త కుదిట‌ప‌డిన‌ట్లు ఉన్న‌ప్ప‌టికి ఉన్న‌ట్టుండి కోవిడ్ వ్యాప్తి దారుణంగా పెరిగింది. అయితే ఒక్క‌సారిగా కోవిడ్ ఈ స్థాయిలో పెర‌గ‌డానికి నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కార‌ణమంటున్నారు వైద్యులు. మ‌న‌కేం అవుతుందిలే అనే నిర్ల‌క్ష్యంతోపాటు కోవిడ్ అయిపోయింది ఇక మ‌న‌కు రాదు అనే ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు నెల‌కున్న ప‌రిస్థితితుల‌కు ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు.

  కోవిడ్ కాస్త తగ్గుముఖం ప‌ట్టిన‌ప్పుడు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. స‌మూహాలు ఏర్ప‌డ‌క‌పోవ‌డమే మంచిద‌ని తెలిపింది. వీలైనంత త‌క్కువ శుభకార్యాలయాలకు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించింది. అయిన‌ప్ప‌టికి వాటిని పెడ చెవిన పెట్ట‌డమే ఇప్పుడున్న ప‌రిస్థితికి కార‌ణం అంటున్నారు నిపుణులు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఆసుప‌త్రి బెడ్స్ కొర‌త విపరీతంగా ఉంది. రోజుకు వేల సంఖ్య‌లో కోవిడ్ లక్ష‌ణాలు ఉన్న‌వారు టెస్టింగ్ సెంట‌ర్స్ ముందు క్యూలు క‌డుతున్నారు. ఒక వైపు ప్ర‌జా నిర్ల‌క్ష్యం ఒక కార‌ణ‌మైతే మ‌రోవైపు వ్యాక్సిన్ అంద‌రికీ అందించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మవ్వడం. వాక్సినేష‌న్ సంఖ్య‌ను పెంచ‌డంలో ప్ర‌భుత్వాలు కాస్త వెనుక‌బ‌డ్డాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. చాలా వ‌ర‌కు మొద‌టి డోస్ వెసుకున్న వారికి రెండో డోస్ వాక్సిన్ ఎక్క‌డ అందుబాటులోలేక‌పోవ‌డం కూడా ఒక ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు.

  ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రికొద్ది రోజుల్లో ప‌రిణామాలు ఇంకాస్త దారుణంగా మారే అవ‌కాశాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీంతోపాటు రిక‌వ‌రీ రేటు చాలా దారుణంగా ప‌డిపోవ‌డం కూడా ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోన్న అంశంగా చెబుతున్నారు వైద్యులు. మ‌రో వైపు తెలంగాణ‌లో మ‌ళ్లీ మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. శుక్ర‌వారం తెలంగాణ వ్యాప్తంగా 9 కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి. ఇదిలా ఉంటే హ‌ర్డ్ ఇమ్యూనిటీ పెరిగితేనే కోవిడ్ ను ఎదుర్కొగ‌లం అనే వాదన కూడా ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోంది. ఇప్ప‌టి హ‌ర్డ్ ఇమ్యూనిటీ ఏం పెర‌గ‌లేద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బ‌య‌ట జ‌న‌సంచారం కాస్త త‌క్కువగా ఉన్న‌ప్ప‌టికీ ఈ చ‌ర్య‌లు కాస్త ముందుగానే తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితి వ‌చ్చేది కాదంటున్నారు నిపుణులు.

  First published:

  Tags: Corona, Covid cases, COVID-19 vaccine, Lock down, Mask, Telangana

  ఉత్తమ కథలు