Coronavirus Effect: రియల్‌మీ నార్జో స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ వాయిదా

Realme Narzo | రియల్‌మీ నార్జో సిరీస్‌లో రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మోడల్స్‌ రానున్నాయి. ఇప్పటికే రియల్‌మీ నుంచి ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి.

news18-telugu
Updated: March 25, 2020, 11:47 AM IST
Coronavirus Effect: రియల్‌మీ నార్జో స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ వాయిదా
Coronavirus Effect: రియల్‌మీ నార్జో స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ వాయిదా (image: Realme India)
  • Share this:
రియల్‌మీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. మార్చి 26న రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్ కార్యక్రమం రద్దైంది. మార్చి 26న మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తామని రియల్‌మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లోనే లాంఛింగ్ ఉంటుంది కాబట్టి ఈ కొత్త ఫోన్లను రియల్‌మీ పరిచయం చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించడంతో తాము కూడా రియల్‌మీ నార్జో సిరీస్‌ లాంఛింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్ తాత్కాలికంగా వాయిదా పడ్డట్టే. అయితే ఈ ఫోన్లను ఎప్పుడు రిలీజ్ చేస్తామని రియల్‌మీ ప్రకటించలేదు.




ఇక రియల్‌మీ నార్జో గురించి చూస్తే... ఇవి ఆ కంపెనీ నుంచి వస్తున్న కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లు. నార్జో సిరీస్‌లో రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మోడల్స్‌ రానున్నాయి. ఇప్పటికే రియల్‌మీ నుంచి ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు వాటితో పాటు రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా వస్తున్నాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి నార్జో సిరీస్‌లో రెండు ఫోన్లు రానున్నాయి. వీటిలో 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటాయని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:Redmi Note 9S: రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ప్రత్యేకతలివే

సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

ATM: ఏటీఎంకు వెళ్లలేకపోతున్నారా? ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు