2021 మార్చి నాటికి భారతీయులకు కరోనా వ్యాక్సిన్... ఇవీ తాజా అంచనాలు...

ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్... ఇలా ఊహాజనితంగా ఏదో ఒకటి చెప్పేయకుండా... కచ్చితంగా వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది అనే అంశంపై తాజా ప్రకటన వచ్చింది.

news18-telugu
Updated: July 22, 2020, 10:09 AM IST
2021 మార్చి నాటికి భారతీయులకు కరోనా వ్యాక్సిన్... ఇవీ తాజా అంచనాలు...
SII చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదర్ పూర్ణావాలా (Image: Twitter/@adarpoonawalla)
  • Share this:
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రా జెనెకా ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ ట్రయల్స్ మంచి ఫలితాలు ఇవ్వడంతో... ఆ వ్యాక్సిన్‌ను ఇండియాలో 70 కోట్ల నుంచి 80 కోట్ల డోసులు తయారుచేస్తామని సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) చెప్పింది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ ఇది. ఈ సంస్థను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా కలిసి ఎంపిక చేశాయి. వ్యాక్సిన్ రెడీ అని నిర్ధారించుకున్న వెంటనే తయారీ మొదలవ్వనుంది. SII చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదర్ పూర్ణావాలా... CNN-న్యూస్ 18 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జక్కా జాకోబ్‌తో ఈ అంశంపై మాట్లాడారు. వ్యాక్సిన్ భవిష్యత్తు, దాని తయారీ, పంపిణీపై తన అభిప్రాయాలు చెప్పారు.

ప్రశ్న : ఈ వ్యాక్సిన్ మూడో ట్రయల్స్ ఓ వారంలో ప్రారంభమవుతాయి. ఇవి పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుంది. మీరు DCGIని సంప్రదించారా? అనుమతి వచ్చిందా? ఈ ప్రక్రియకు ఎంతకాలం పడుతుందని అనుకుంటున్నారు?

జవాబు : ఇప్పటి నుంచి ఓ నెలలో మేం అసలైన ట్రయల్స్ చేస్తాం. ఆస్పత్రుల్లో పేషెంట్లపై ట్రయల్స్ చేస్తాం.

ప్రశ్న : మూడో ట్రయల్స్‌ ఎంతమందిపై జరుగుతాయి? ఆస్పత్రుల్ని గుర్తించారా?
జవాబు : ముంబై, పుణెలో చాలా ఆస్పత్రుల్ని గుర్తించాం. అక్కడే ఎక్కువ కరోనా కేసులున్నాయి. ఎంతమందిపై అనేది ఇంకా నిర్ణయించలేదు. దాదాపు 5వేల మందిపై జరిపే అవకాశం ఉంది.

ప్రశ్న : అంతా అనుకున్నట్లే జరిగితే... చరిత్రాత్మక వ్యాక్సిన్ వెనక ఓ ఇండియన్ కంపెనీ కూడా ఉన్నట్లవుతుంది. దీనిపై ఏమంటారు?
జవాబు : మేం వారి టెక్నాలజీని వాడి వ్యాక్సిన్ తయారుచేస్తాం. ఓ ఇండియన్ కంపెనీగా అది మాకు గర్వకారణం. ఈ వ్యాక్సిన్‌లో ఇంకా చాలా కంపెనీల పాత్ర ఉంది. పశ్చిమ దేశాల ప్రజలు వ్యాక్సిన్ల గొప్పదనాన్ని గుర్తించారు. ప్రపంచంలో వ్యాక్సిన్ల తయారీలో ఇండియాయే లీడర్.ప్రశ్న : వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకున్నవారికి... యాంటీబాడీస్ 28 రోజులు ఉంటున్నాయి. డబుల్ డోస్ తీసుకున్నవారిలో 2 నెలలు ఉంటున్నాయి. ఆ తర్వాత ఏమవుతుంది?
జవాబు : చాలా వ్యాక్సిన్లను రెండు, మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి వ్యాక్సిన్ వల్ల 50-60 శాతం రక్షణ లభిస్తుంది. రెండో వ్యాక్సిన్ వల్ల రక్షణ 70-80 శాతానికి చేరుతుంది. అన్ని వ్యాక్సిన్లలోనూ ఇలాగే ఉంటుంది. కరోనా వ్యాక్సినూ అంతే. దాదాపు 90 శాతం మంది ఒక్క డోసుకే కోలుకున్నారు. మిగతా 10 శాతం మందికి రెండో డోస్ అవసరమైంది.

ప్రశ్న : రెండు డోసులు తీసుకుంటే... ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకూ కరోనా సోకదని అనుకోవచ్చా?
జవాబు : ఇది తెలియాలంటే మూడో ట్రయల్ వరకూ ఆగాల్సిందే. ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చాక... 2-3 నెలలు గమనించాలి. ఈలోగా వాళ్లకు వైరస్ సోకుతుందేమో చూడాలి. అందుకే మాకు నవంబర్ దాకా టైమ్ పడుతుందని అంటున్నాం.

ప్రశ్న : ఈ వ్యాక్సిన్ వల్ల అలసట, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీనిపై ఏమంటారు?
జవాబు : చాలా వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు జ్వరం, తలనొప్పి, చెమట వంటివి వస్తాయి. ఈ వ్యాక్సిన్‌కి సైడ్ ఎఫెక్టులేవీ లేవు. నాకు ఆ నమ్మకం ఉంది.

ప్రశ్న : కోవ్యాక్సిన్, కేరళలోని జైరస్ వంటి వాటితో మీకు సంబంధం ఉందా?
జవాబు : లేదు. అవి స్వయంగా తయారుచేస్తున్నాయి.

ప్రశ్న : మూడో ట్రయల్‌లో సమస్యలు వస్తే... మీరు దాదాపు రూ.1491 కోట్లు నష్టపోతారా?
జవాబు : అవును. మేం నష్టపోతాం. కానీ ఈ పరిస్థితుల్లో నష్టపోవడానికి కూడా మేం సిద్ధమై నిర్ణయం తీసుకున్నాం.

ప్రశ్న : ఇంకో అరడజను కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. మీరు ఆ రేసులో ముందున్నట్లేనా?
జవాబు : మేం తొందరపడదలచుకోలేదు. మేం బెస్ట్ వ్యాక్సిన్ ఇస్తాం. అది దీర్ఘకాలం రక్షణ ఇచ్చేదై ఉంటుంది. అదే మేం ఇస్తున్న సవాలు. ఇంకా చాలా వ్యాక్సిన్లు వస్తాయి. కానీ మాదైతే విజయవంతం అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది.

ప్రశ్న : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌లో యాంటీబాడీలతోపాటూ... టీసెల్స్ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఆ రెండూ ఎందుకు అవసరం?
జవాబు : యాంటీబాడీలు 3 నెలల వరకూ ఉంటాయి. టీ-సెల్స్ దీర్ఘకాలం ఉంటాయి. ఏడాది లేదా రెండేళ్లైనా రక్షణ ఇస్తాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ వల్ల టీ సెల్స్ బాగా ఉత్పత్తవుతున్నాయి. అవి చైనాలోని కాన్సినో వ్యాక్సిన్‌తో కంటే... నాలుగు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రశ్న : నవంబర్ నాటికి మీ ట్రయల్స్ పూర్తవుతాయి. వెంటనే వ్యాక్సిన్ వచ్చేస్తుందా?
జవాబు : డిసెంబర్ లేదా... 2021 మార్చి లోపల వ్యాక్సిన్ వస్తుంది. భారతదేశం మొత్తం అది చేరడానికి టైమ్ పడుతుంది. డిసెంబర్‌లో హెల్త్ కేర్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నాం.

ప్రశ్న : వచ్చే ఏడాది చివరి నాటికి ఎన్ని డోసుల వ్యాక్సిన్లు మీరు చెయ్యగలరు?
జవాబు : మేం సంవత్సరానికి 70 కోట్ల నుంచి 80 కోట్ల డోసులు తయారుచెయ్యగలం. ముందే ఛాన్స్ వస్తే డిసెంబర్ నాటికే 30 కోట్ల డోసులు చెయ్యగలం. ప్రతి ఒక్కరికీ రెండేసి డోసుల చొప్పున ఇవ్వాలనుకుంటే... ప్రపంచం మొత్తానికీ వ్యాక్సిన్ చేరడానికి 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది.
Published by: Krishna Kumar N
First published: July 22, 2020, 10:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading