Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కేసీఆర్, జగన్‌లను మెచ్చుకున్న రష్మీ.. ఆటాడుకుంటున్న నెటిజన్స్..

కేసీఆర్, జగన్‌లను మెచ్చుకున్న రష్మీ.. ఆటాడుకుంటున్న నెటిజన్స్..

సీఎం కేసీఆర్,సీఎం జగన్, రష్మీ గౌతమ్ (Twitter/Photo)

సీఎం కేసీఆర్,సీఎం జగన్, రష్మీ గౌతమ్ (Twitter/Photo)

తెలుగు టీవీ  ఛానెల్స్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. తాజాగా రష్మీ గౌతమ్.. తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్ లపై చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

తెలుగు టీవీ  ఛానెల్స్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలను కరోనా వైరస్ సందర్భంగా ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదు. ఒక్క పారసిటమల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాకు మందు పారాసిటమల్ టాబ్లెట్ అని చెప్పడంతో సోషల్ మీడియాలో కేసీఆర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి కూడా అదే బాటలో కరోనాకు పారసిటమల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందన్నారు. దీనిపై రష్మీ గౌతమ్.. ప్రజల తరుపున ఈ ఇద్దరు సీఎంలకు కృతజ్ఞతలు తెలిపింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. మన దేశ ప్రభుత్వం కూడా కరోనా జాతీయ విపత్తుగా ప్రకటించింది. అలాంటి భయంకరమైన  కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రజలు గందరగోళం పడుతుంటే.. మన తెలుగు రాష్ట్రాల సీఎంలు పారాసిటమల్ గోలి వేసుకుంటే సరిపోతందని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పినందుకు రష్మీ గౌతమ్...కాస్తంత వ్యంగ్యంగా ప్రపంచమే ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక మందు కనిపెట్టడం కోసం రాత్రి పగలు కష్టపడుతుంటే మీరు ప్రజలకు చెప్పిన ధైర్యానికి హాట్సాఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రష్మీ గౌతమ్ ట్వీట్‌కు ఇటు కేసీఆర్‌ అభిమానులతో పాటు జగన్ మోహన్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను అనరాని మాటలతో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు మాత్రం రష్మీ గౌతమ్ చేసిన దాంట్లో తప్పేమిలేదు. బాధ్యత గల ముఖ్యమంత్రులు స్థానంలో ఉన్నవాళ్లు కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయడం మంచిది కాదని మరికొందరు నెటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తనాకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలను ఉద్దేశించి రష్మీ గౌతమ్ చేసిన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Frashmigautam27%2Fstatus%2F1239418652077649920&widget=Tweet

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Coronavirus, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు