కరోనా ఎఫెక్ట్‌తో రణ్‌వీర్ సింగ్ 83 బయోపిక్ వాయిదా..

Covid 19 | చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అక్షయ్ సూర్యవంశీ రిలీజ్ డేట్ పోస్ట్ అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కరోనా ఎఫెక్ట్ కారణంగా రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న 83 బయోపిక్ విడుదల వాయిదా పడింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 20, 2020, 11:09 AM IST
కరోనా ఎఫెక్ట్‌తో రణ్‌వీర్ సింగ్ 83 బయోపిక్ వాయిదా..
కపిల్ దేవ్ బయోపిక్ 83 పేరుతో రాబోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. (ఫైల్ ఫోటో)
  • Share this:
చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో మన దేశంలో కూడా ఒకరు చనిపోయారు. తాజాగా ఈ ఎఫెక్ట్‌తో చాలా సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘సూర్యవంశీ’ రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించిన ‘83’ బయోపిక్‌ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం 1983లో భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్‌ను తీసుకొచ్చిన ఆల్‌రౌండర్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథతో  ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ ది ఫిల్మ్ అనే మూవీని తెరకెక్కించాడు. పెళ్లైన తర్వాత రణ్‌‌వీర్ సింగ్, దీపికా పదుకొణే ఈ చిత్రంలో నిజ జీవిత భార్య భర్తలైన కపిల్ దేవ్, రోమి పాత్రల్లో నటించడం విశేషం.  ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో నాగార్జున ఈ సినిమా రైట్స్ భారీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే కదా.


ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించారు. కరోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని కొద్ది రోజులు వాయిదా వేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రజల ఆరోగ్యం భద్రత కన్నా మాకు ఏది ముఖ్యంకాదు. కరోనా ఎఫెక్ట్ తగ్గాకా ఈ చిత్రానికి సంబంధించిన మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ కారణంగా థియేటర్స్ మూత పడ్డాయి. ఇలాంటి ప్రళయ పరిస్థితుల్లో ప్రజలు థియేటర్స్ వైపు రావడమే మానేసారు. అందుకే ఒక్కొక్కరుగా తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా మన దేశంలో సినీ రంగంలో రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమే ఏకంగా రూ.1000 కోట్ల వరకు నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 20, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading