రానా ‘అరణ్య’ సినిమాకు కరోనా కష్టాలు.. విడుదల వాయిదా..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్.. ఎవ్వరినీ ఒదలడం లేదు. ఈ ఎఫెక్ట్‌తో జనాలు థియేటర్స్ వైపు రావడమే మానేసారు. తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో రానా అరణ్యపై ఎఫెక్ట్ పడింది.

news18-telugu
Updated: March 16, 2020, 7:57 PM IST
రానా ‘అరణ్య’ సినిమాకు కరోనా కష్టాలు.. విడుదల వాయిదా..
రానా ‘హాథీ మేరే సాథీ’ సినిమా టీజర్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్.. ఎవ్వరినీ ఒదలడం లేదు. ఈ ఎఫెక్ట్‌తో జనాలు థియేటర్స్ వైపు రావడమే మానేసారు. ఇక తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్‌తో పాటు జిమ్స్, స్కూల్స్, కాలేజీలను ఈ నెల 31 వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే ఉగాదికి విడుదల కావాల్సిన నాని ‘V’ సినిమా విడుదల వాయిదా పడింది. మరోవైపు బాలీవుడ్‌లో చాలా సినిమాలు తమ విడుదల తేదిని మార్చుకున్నాయి. అన్ని రీ షెడ్యూల్ అవుతున్నాయి. తాజాగా రానా హీరోగా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అన్ని షూటింగ్స్ రద్దు చేసారు. మరోవైపు బాలీవుడ్‌లో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసారు. అరణ్య చిత్ర విషయానికొస్తే.. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రానా అడవి మనిషిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. మరోవైపు కరణ్ జోహార్ తన ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోన్న అన్ని చిత్రాల షూటింగ్‌ను తాత్కలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు షూటింగ్స్ చేసే ప్రసక్తే లేదంటున్నారు.


First published: March 16, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading