Home /News /coronavirus-latest-news /

CoronaVirus | అయోధ్యపై యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం...

CoronaVirus | అయోధ్యపై యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం...

ఆలయ నమూనా (File - credit - twitter - Evil Aryan)

ఆలయ నమూనా (File - credit - twitter - Evil Aryan)

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు రద్దు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

    కరోనా వైరస్ ప్రభావం అయోధ్య రాముడి మీద కూడా పడింది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఈ సంవత్సరం రద్దు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు గుమిగూడ వద్దని, జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో చెప్పారు. ఈ క్రమంలో శ్రీరామనవమికి అయోధ్యలో నిర్వహించే వేడుకలకు ప్రజలను అనుమతించవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.

    అయోధ్య రామజన్మభూమిపై కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన కోర్టు వివాదానికి కొన్నాళ్ల క్రితమే తెరపడింది. అయోధ్యలో రామజన్మభూమి ట్రస్ట్‌కు చెందుతుందని స్పష్టం చేసింది. ఇక మసీదు కోసం మరో చోట ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామ జన్మభూమి వివాదం ముగిసిన తర్వాత తొలిసారి జరగబోయే శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చర్యలు పెను ప్రమాదానికి దారి తీస్తాయన్న భయంతో వేడుకలను రద్దు చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Uttar pradesh, Yogi adityanath

    తదుపరి వార్తలు