Home /News /coronavirus-latest-news /

RAM GOPAL VARMA SATIRICAL TWEET ON KA PAUL DUE TO CORONAVIRUS TA

కేఏ పాల్‌కు రామ్ గోపాల్ వర్మ సవాల్.. నీకు అంత సీన్ ఉందా అంటూ..

రాంగోపాల్ వర్మ,  కేఏ పాల్ (ఫైల్ ఫొటోలు)

రాంగోపాల్ వర్మ, కేఏ పాల్ (ఫైల్ ఫొటోలు)

తాజాగా రామ్ గోపాల్ వర్మ.. క్రైస్తవ మత గురువు కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

    ఎపుడు ఎవరినీ ఎలా గిల్లాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. రీసెంట్‌గా అభిమానుల నుంచి రక్షణ కోసం రెండు కుక్కలను పెంచుకుంటున్నట్టు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. క్రైస్తవ మత గురువు కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ పై ఇప్పటికే పలు రకాలుగా ట్వీట్లు చేసిన వర్మ.. తాజాగా కేఏ పాల్‌ను ఉద్దేశిస్తూ.., అరే కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావు.. నీకు దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్టు చేయి అంటూ కేఏ పాల్ పై కాస్తంత వ్యంగ్యంగానే ట్వీట్ చేసాడు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కేఏ పాల్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దీని పైనే వర్మ తనదైన శైలిలో ట్విట్టర్‌లో విరుచుకపడ్డాడు.


    రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. భగవంతుడు, కరోనా వైరస్ మధ్య ఏదో సంబంధం ఉందన్నాడు. దేవుడు పాపులను శిక్షించడానికి ఇలాంటి వైరస్ తీసుకొచ్చాడు. దాన్ని నిర్మూలించాలని చూస్తే మనం ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేసినవాళ్లమవుతాం అంటూ ట్వీట్ చేసాడు. గతంలో రామ్ గోపాల్ వర్మకు కేఏ పాల్‌కు ట్విట్టర్ వేదికగా బస్తీమే సవాల్ అనుకున్న సందర్భాలున్నాయి. మొత్తానికి రామ్ గోపాల్ వర్మకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇపుడు కరోనా వైరస్ దొరికిందని నెటిజన్స్ అంటున్నారు. తాజాగా ఈయన దిశా అత్యాచార ఘటన పై సినిమా తీస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Covid-19, Ka paul, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు