RGV on Anandayya: ఆనందయ్య మందుపై ఆర్జీవీ రియాక్షన్ ఇదే... కృష్ణపట్నంతో అమెరికాకు లింక్...

ప్రతీకాత్మకచిత్రం

Krishnapatnam Anandayya: కరోనాకు ఆయుర్వేద మందు అందిస్తున్న ఆనందయ్యపై సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. ప్రస్తతం సోషల్ మీడియాలో ఆనందయ్య ట్రెండ్ అవుతున్నారు.

 • Share this:
  ప్రస్తుతం ఆనందయ్య మందు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఫేమస్ అవుతోంది. కరోనా మందు పేరుతో ఇస్తున్న పసరు మందుపై సర్వత్రా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఈ మందు పనిచేస్తోందని కొందరు చెప్తుంటే.. ఆకు పసర్లు నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని మరికొందరు చెప్తున్నారు. ఈ మందు వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. అటు ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు కూడా కృష్ణపట్నం వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం దీనిపై డెమోను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీకి బ్రేక్ వేసినా ఇంకా జనం కృష్ణపట్నం వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించి అక్కడికి వెళ్లేవారిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

  ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆనందయ్య ముందుపై సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో స్పందించారు. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి మిలటరీతో భద్రత ఏర్పాటు చేయాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఆర్జీవీ అక్కడితో ఆగలేదు.., అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆంటోనీ ఫౌచీ ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నం బయలుదేరి ఉంటారని.. వాళ్లు ఆనందయ్యను కిడ్నాప్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థలు తమ ఫార్ములాను బయటకు చెప్పలేదని.. కానీ ఆనందయ్య మాత్రం మందు తయారు చేసే వివరాలను బయటపెట్టడమే కాకుండా.., ఫ్రీగా మందు అందిస్తున్నారు కాబట్టి.. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

  ఇక ఐసీఎంఆర్ గనుక ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. WHO ప్రతినిథులు కృష్ణపట్నంలో వాలిపోతారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్, పూనావాల, స్పుత్నిక్ వాకా సంస్థలకు నిధులు ట్రాన్స్ ఫర్ చేయడం మానేసి వాటిని ఆనందయ్యకు మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఆనందయ్యపైనా ఆర్జీవీ తన మార్క్ ప్రశ్నలు స్పందించారు. నోరు, ముక్కు, చెవులు ద్వారా ఐతే ఓకేగానీ.. కళ్లకు ఊపిరితిత్తులకు సంబంధమేంటని ప్రశ్నించారు.

  ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు రోజులుగా ఆనందయ్య మందులు బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా నుంచి మందుల వరకు దేనిని ఆర్జీవీ వదలడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆనందయ్య సెలబ్రెటీ అయిపోయారు. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్ లో ఆనందయ్యకు చెందిన మెసేజ్ లు, ఆయుర్వేదం మందు సమాచారమే బాగా వైరల్ అవుతోంది.
  Published by:Purna Chandra
  First published: