హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

పేద కళాకారుల కోసం రజినీకాంత్ భారీ విరాళం.. ఆయన బాటలో సూర్య మిగతా హీరోలు..

పేద కళాకారుల కోసం రజినీకాంత్ భారీ విరాళం.. ఆయన బాటలో సూర్య మిగతా హీరోలు..

రజినీకాంత్,సూర్య (Twitter/Photo)

రజినీకాంత్,సూర్య (Twitter/Photo)

రోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. అందులో సినిమా పరిశ్రమ కూడా ఉంది. అంతేకాదు అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్   ఆగిపోయాయి. దీంతో దీనిపై ఆధారపడి ఎంతో మంది పేద కళాకారులు జీవిస్తూ ఉంటారు వాళ్లందరు ఈ పరిస్థితితో రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.వారిని ఆదుకునేందుకు..

ఇంకా చదవండి ...

  కరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది.  దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే  మన దేశంలోని అన్ని లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. రైళ్లు, బస్సులు, విమానాలు  ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా, గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. అందులో సినిమా పరిశ్రమ కూడా ఉంది. కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే . ఇప్పటికే దేశ వ్యాప్తంగా థియేటర్స్ అన్నింటినీ మూసేసారు. అంతేకాదు అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్   ఆగిపోయాయి. దీంతో దీనిపై ఆధారపడి ఎంతో మంది పేద కళాకారులు జీవిస్తూ ఉంటారు వాళ్లందరు ఈ పరిస్థితితో రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీని వల్ల పెద్ద కళాకారులకు ఏమి కాకపోయినా.. రోజు వారీ సినీ కళాకారుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఇప్పటికే దక్షిణ భారత సినీ కళాకారులను ఆదుకోవడానికి పెద్ద హీరోలు ముందుకొస్తున్నారు.

  rajinikanth suriya vijay sethupathi and other kollywood heroes help to poor film workers,rajinikanth help poor film workers,rajasekhar,nithiin,prakash raj,rajinikanth,suriya karthi help poor film workers,vijay sethupathi help poor film workers due to coronavirus effect,covid 19,kollywood,కరోనా వైరస్,కోవిడ్ 19,రజినీకాంత్ సహాయం,సూర్య కార్తీ ఆర్ధిక సాయం,పేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రజినీకాంత్,ప్రకాష్ రాజ్
  కార్తి, విజయ్ సేతుపతి (Facebook/Photo)

  ఇక పేద కళాకారులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ రూ.50 లక్షల విరాళం అందజేశారు. హీరో సూర్య, కార్తిలు కలిసి చెరో పది లక్షల రూపాయాలు అందిస్తున్నారు. అలాగే సినీ నటుడు విజయ్ సేతుపతి కూడా తనవంతుగా పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించాడు.వీళ్ల బాటలోనే మిగతా హీరోలు కూడా పేద కళాకారులను ఆదుకునేందుకు ముందు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగత సహాయ సిబ్బందికి మే నెల వరకు సంబంధించిన అన్ని జీతాలను ముందే చెల్లేంశారు. ఇక తెలుగులో హీరో రాజశేఖర్ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద కళాకారులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నాడు. మరోవైపు హీరో నితిన్ కూడా తన వంతుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Coronavirus, Covid-19, Karthi, Kollywood, Nithiin, Rajinikanth, Suriya, Tollywood, Vijay Sethupathi

  ఉత్తమ కథలు