Undavalli Arun Kumar tested covid-19 positive: ఏపీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యూలతో పాటు పలువురు ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చేరిపోయారు. అనేక అంశాలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఉండవల్లి.. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. అయితే రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రాజమండ్రిలోని తన ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
ఇక రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 1528 కేసులు నమోదయ్యాయి. 11 మంది వైరస్ బారిన చనిపోయారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 53567కు చేరుకోగా.. ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 354కు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.