రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం...10 మంది ఖైదీలకు కరోనా

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 28 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకినట్లు ఏపీ జైళ్ల శాఖ తెలిపింది.

news18-telugu
Updated: August 6, 2020, 10:56 AM IST
రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం...10 మంది ఖైదీలకు కరోనా
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 28 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకినట్లు ఏపీ జైళ్ల శాఖ తెలిపింది. మొత్తం 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా, మరికొన్ని ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కరోనా సంక్రమణ నేపథ్యంలో ఖైదీల ములాఖత్ లు తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈరోజు సాయంత్రానికి పూర్తిగా కరోనా నిర్ధారణ ఫలితాలు రానున్నట్టు జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఈ సాయంత్రం ఇస్తామని అంటున్నారు. సెంట్రల్ జైలు లో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు.

జైలు లో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ సోకిన ఖైదీలకు కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, కరోనా సోకిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో  ఉన్నారు. మరోవైపు జైలులో 200 మందికి కరోనా సోకిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. కాగా వార్తలను అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
Published by: Krishna Adithya
First published: August 6, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading