కరోనా కట్టడి కోసం రాజమౌళి ఏం ఇస్తున్నాడో తెలుసా..?

Rajamouli: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే.. మరోవైపు దీనివల్ల నష్టపోతున్న ప్రజలను, బాధితులను ఆదుకోడానికి తమ వంతు సాయంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 4:20 PM IST
కరోనా కట్టడి కోసం రాజమౌళి ఏం ఇస్తున్నాడో తెలుసా..?
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే.. మరోవైపు దీనివల్ల నష్టపోతున్న ప్రజలను, బాధితులను ఆదుకోడానికి తమ వంతు సాయంగా మన హీరోలు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.. ఇంకా ఇస్తున్నారు కూడా. ఇప్పటికే ప్రభాస్ 4 కోట్లు.. పవన్ 2 కోట్లు.. అల్లు అర్జున్ కోటి 25 లక్షలు.. మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాంతో పాటు ప్రత్యేకంగా కరోనా క్రైసస్ ఛారిటీకి కూడా లక్షలకు లక్షలు విరాళంగా ఇస్తున్నారు.

ఎన్టీఆర్, చరణ్, మహేష్ బాబు (Twitter/Photo)
ఎన్టీఆర్, చరణ్, మహేష్ బాబు (Twitter/Photo)


దీనికి కూడా చరణ్ 30 లక్షలు.. ఎన్టీఆర్ 25 లక్షలు.. నాగార్జున, చిరంజీవి కోటి.. మహేష్ బాబు 25 లక్షలు.. రవితేజ, వరుణ్ తేజ్ 20 లక్షలు.. శర్వానంద్ 15 లక్షలు ఇలా చాలా మంది సాయం చేసారు. ఇక రాజమౌళి నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. దాంతో అభిమానులతో పాటు మీడియా కూడా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి దేశసేవ చేయాల్సిన సమయం వచ్చేసింది.. అదే చేయాలి.. చేస్తున్నారు కూడా అని చెప్పాడు దర్శక ధీరుడు.

టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)
టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)
దేశం కష్టాల్లో ఉన్నప్పుడు అందరు తమ బాధ్యతగా విరాళాలివ్వడం అభినందించాల్సిన విషయం.. ఇప్పుడు మన ఇండస్ట్రీ కూడా ఇదే చేసిందని చెప్పాడు ఈయన. ఇదిలా ఉంటే ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు, వైద్యులు, నర్సులు చేస్తున్న సేవలకు మనం రుణపడిపోయాం. వాళ్లకు పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ చాలా అవసరం అవుతాయి.. వాటిని రీ సైకిల్ చేసుకుని వాడుకోడానికి కూడా ఉండదు కాబట్టి అవి దొరకడం కూడా కష్టమవుతున్నాయి. అందుకే తమ టీం అంతా కలిసి భారీగా ఫేస్ మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ కూడా అందించబోతున్నామని చెప్పాడు. ఆర్థికంగా కూడా రాజమౌళి సాయం ప్రకటించే అవకాశం ఉంది.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading